నెలకు 20 రోజులు పని దొరకదు, పని లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు

వీడియో క్యాప్షన్, నెలకు 20 రోజులు పని దొరకదు, పని లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు

నగరాల్లో, పట్టణాల్లో పని కోసం ఉదయాన్నే క్యారేజీలు పట్టుకుని అడ్డాలకు చేరుకునే వారు కనిపిస్తుంటారు. అలా అడ్డాలకు చేరుకునే అందరికి పని దొరకదు. దొరికితే పనికి, లేదంటే మళ్లీ ఇంటికి. ఏ రోజూ మరుసటి రోజుకి గ్యారంటీ ఉండదు. ప్రతిరోజూ రేపటి కోసం చింతే. ఏ రోజుకారోజు అనిశ్చితే. ఇదే అడ్డాకూలీల జీవితం.

అడ్డా కూలీగా పని చేస్తున్న అప్పయ్యమ్మది శ్రీకాకుళం జిల్లా. 20 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం భర్తతో కలిసి విశాఖ వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వీరి కుటుంబంలోని నలుగురు నిర్మాణ రంగంలో కూలీలుగానే పని చేస్తున్నా, రోజూ అందరికీ పని దొరకదు.

అసంఘటిత రంగంలో ఉన్న అనిశ్చితికి ఈ కుటుంబం ఒక ఉదాహరణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)