మోహన్ భాగవత్: ‘‘15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం’’.. నెటిజన్లు ఏం అంటున్నారంటే..

మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, ANI

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ ‘‘అఖండ భారత్’’ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

మరో 15ఏళ్లలో భారత్ ‘‘అఖండ భారత్’’ అవుతుందని భాగవత్ చెప్పారు. మన కళ్లతోనే ఆ అఖండ భారతాన్ని చూస్తామని అన్నారు.

మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయనకు మద్దతు పలుకుతుంటే, మరికొందరు ఆయన్ను విమర్శిస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

‘‘మోహన్ భాగవత్ ఎవరు?’’ – కాంగ్రెస్ అధికార ప్రతినిధి

మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెత్ మాట్లాడారు. ‘‘ఇంతకీ భాగవత్ ఎవరు? ప్రధాన మంత్రా? లేక హోం మంత్రా? లేక జడ్జా?’’అని ఆమె ప్రశ్నించారు.

‘‘భాగవత్ గారు హిందూ రాష్ట్రం, అఖండ భారత్ గురించి మాట్లాడుతున్నారు. ముందు మన భూభాగంలో తిష్టవేసిన చైనాను వెళ్లగొట్టండి’’అని ఆమె అన్నారు.

మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, ANI

భాగవత్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 15ఏళ్లలో కాదు 15 రోజుల్లో అఖండ భారత్‌ కలను సాకారం చేసి చూపించండని రౌత్ వ్యాఖ్యానించారు.

‘‘మొదట పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలపండి. ఆ తర్వాత మిగతా పాకిస్తాన్, శ్రీలంకలను కలిపి అఖండ భారత్ కల కూడా సాకారం చేయండి. మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదు. 15ఏళ్లు ఎందుకు, 15 రోజుల్లోనే దీన్ని పూర్తి చేయండి’’అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా భాగవత్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘భాగవత్‌జీ అఖండ భారత్ గురించి తర్వాత మాట్లాడొచ్చు. ముందు పక్కనే కూర్చున్న చైనాను ఆక్రమిత ప్రాంతాల నుంచి వెళ్లగొట్టండి. అక్కడ భారత సైన్యం గస్తీ కాయడం కూడా కష్టమవుతోంది. దాని గురించి ముందు మాట్లాడండి’’అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భాగవత్ వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. ప్రజల మనోభావాలతో భాగవత్ ఆడుకుంటున్నారని ఏచూరి అన్నారు.

‘‘అఖండ భారత్ అంటే ఏమిటి? బంగ్లాదేశ్, మియన్మార్, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌లకు వీరు ఏం మాట్లాడుతున్నారో ఎవరైనా చెప్పండి. వీరు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు’’అని ఏచూరి అన్నారు.

భాగవత్ ఇంకా ఏం అన్నారు?

వచ్చే 20 నుంచి 25ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం అవుతుందని జ్యోతిష్యులు చెప్పినట్లు మీడియా కథనాలు వచ్చాయి. దీనిపై మోహన్ భాగవత్ స్పందించారు.

అందరూ ఆ దిశగా కృషి చేస్తే మనం పది నుంచి 15ఏళ్లలోనే అఖండ భారత్ కల సాకారం చేసుకోవచ్చని భాగవత్ వ్యాఖ్యానించారు. ‘‘భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోంది. మనకు అడ్డొచ్చే అవరోధాలన్నీ మట్టిలో కలిసి పోతాయి’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, అయోధ్య ఉద్యమంలో మహిళా లీడర్లు..

నెటిజన్లు ఏం అంటున్నారు?

సోషల్ మీడియాలో భాగవత్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి.

కొందరు భాగవత్ వ్యాఖ్యలను ఖండిస్తుంటే, మరికొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇంకొందరు ఆయనపై చతుర్లు విసురుతున్నారు.

‘‘15ఏళ్లలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్‌లో కలిసిపోతాయి. అప్పుడు భారత్‌లో ముస్లింల సంఖ్య 62 కోట్లకు పెరుగుతుంది. అప్పుడు తాలిబాన్లతోపాటు, పాకిస్తానీ మిలిటెంట్లు కూడా ఇక్కడే ఉంటారు. వాట్ యాన్ ఐడియా సర్ జీ’’అని సీనియర్ జర్నలిస్టు ఆశుతోష్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వీడియో క్యాప్షన్, బాబ్రీ మసీదు కూల్చివేతపై ఈ కరసేవకులు ఏమంటున్నారంటే..

మరో ట్విటర్ యూజర్ దీపక్ యాదవ్‌ కూడా హిందూ-ముస్లింల జనాభాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘’20 కోట్ల మంది ముస్లింలతో హిందువులు ప్రమాదంలో పడ్డారని అంటున్నారు. మరి అఖండ భారత్‌తో ముస్లింల జనాభా 80 కోట్లు అవుతుంది’’అని దీపక్ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. ‘‘మీరు ఇలానే కష్టపడితే 15ఏళ్లలో అఖండ భారత్ కల సాకారం అవుతుందని మోహన్ భాగవత్ చెబుతున్నారు. మనం ఇలానే పనిచేస్తే కొన్నేళ్లలోనే పెట్రోలు, డీజిలు ధరలు మూడు సెంచరీలు కొట్టకుండా మనం అడ్డుకోవచ్చు. అది ఎలానో మీకూ తెలుసు’’అని చమత్కరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)