పాకిస్తాన్‌లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్

రాజ్యసభలో ప్రకటన చేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాజ్యసభలో ప్రకటన చేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత క్షిపణి ఒకటి పొరపాటున పాకిస్తాన్‌లో పడిన అంశంపై రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ ఘటనపై జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఇటు అమెరికా, చైనాలు కూడా ఈ ఘటనపై స్పందించాయి.

దేశభద్రత, ఆయుధాల సక్రమ వినియోగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని, ఈ ఘటనకు అసలు కారణమేంటో విచారణ తర్వాత తెలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

''ఈ ఘటన మార్చి 9, 2022న జరిగింది. తనిఖీలు చేస్తుండగా క్షిపణి పొరపాటున రిలీజ్ అయ్యింది. ఈ తనిఖీలు రెగ్యులర్ మెయింటెనెన్స్‌లో భాగంగా జరిగాయి. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఈ ఘటన జరిగింది'' అని రాజ్ నాథ్ వెల్లడించారు.

''పేలిన క్షిపణి పాకిస్తాన్‌కు చెందిన భూభాగంలో పడింది. జరిగిన ఘటనకు చాలా చింతిస్తున్నాం. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఉపశమనం కలిగించింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరుపుతుంది'' అని రాజ్‌నాథ్ తన ప్రకటనలో తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

''ప్రమాదం జరగడానికి గల కారణాలను ఈ విచారణ నిర్ధారిస్తుంది. ఇదే సమయంలో ఈ సంఘటన తర్వాత ఆపరేషన్, మెయింటెనెన్స్, చెకింగ్‌లకు సంబంధించిన ప్రామాణిక విధానాలను కూడా సమీక్షిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఆయుధ వ్యవస్థల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. వ్యవస్థలో ఎలాంటి లోపాలున్నా సరి చేస్తాం'' అని మంత్రి చెప్పారు.

''మన క్షిపణి వ్యవస్థలు అత్యంత సురక్షితమైనవి. మన భద్రతా విధానాలు, ప్రోటోకాల్స్ కూడా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాం. మన సాయుధ దళాలు బాగా శిక్షణ పొందాయి. ఇక్కడ క్రమశిక్షణతో పాటు, అన్ని వ్యవస్థలను మెయింటెయిన్ చేయడానికి కావలసిన అనుభవం ఉన్నవారు ఉన్నారు'' అని మంత్రి వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

జర్మనీకి సమాచారమిచ్చిన పాకిస్తాన్

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ సోమవారం జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలిన్ బెయిర్‌బాక్‌ కు ఫోన్ చేసి, భారత క్షిపణి తమ దేశంలో కూలిన ఘటన గురించి తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

భారత ప్రభుత్వం పొరపాటున ఈ ఘటన జరిగినట్లు తెలిపిందని, కానీ, అంత పెద్ద విషయాన్ని చిన్న మాటతో సరిపుచ్చడం సరికాదని జర్మనీ మంత్రికి చెప్పినట్లు ఆ ప్రకటన వెల్లడించింది.

ఈ వ్యవహారంపై సంయుక్తంగా విచారణ జరిపించాలని తమ తరఫున డిమాండ్ చేశామని కూడా పాకిస్తాన్ తెలిపింది. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా పరిగణించాలని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ అన్నారు. అయితే, ఈ అంశంపై జర్మనీ విదేశాంగ మంత్రి ఎలా స్పందించారన్న విషయం మాత్రం పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటనలో చెప్పలేదు.

చైనా ఏమన్నది?

కాగా, ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తన వైఖరిని వెల్లడించింది. ఈ అంశంపై భారత్, పాకిస్తాన్‌లు వీలైనంత త్వరగా చర్చలు జరపాలని, సమగ్రమైన దర్యాప్తు ప్రారంభించాలని చైనా విదేశాంగా శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు.

''ఈ వ్యవహారంపై సంబంధిత సమాచారాన్ని గమనించామని, పాకిస్తాన్, భారత్‌లు దక్షిణాసియాలో కీలకమైన దేశాలు కాబట్టి, ఈ ప్రాంత స్థిరత్వాన్ని కాపాడటం రెండు దేశాల బాధ్యత'' అని లిజియాన్ అన్నారు.

ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా ఒక వ్యవస్థను రూపొందించుకోవాలని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అమెరికా ఏమన్నది?

''నేను భారత ప్రభుత్వం ఇచ్చిన వివరణను గమనించాను. ఇది ఒక చిన్న ప్రమాదం తప్ప మరొకటి కాదు'' అని మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు.

''అసలు ఏం జరిగిందన్న అంశంపై అవసరమైతే భారత రక్షణ శాఖతో మాట్లాడతాం'' అని ప్రైస్ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు?

పాకిస్తాన్ కోరుకుంటే దానికి ప్రతీకారంగా ఏదైనా చేయగలదని, కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని ఇమ్రాన్ ఓ ర్యాలీలో వ్యాఖ్యానించారు.

''మనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భారత క్షిపణి కూడా వచ్చింది. మనం తల్చుకుంటే ఏదైనా చేయగలం'' అని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని హఫీజాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు. ''సరైనా మార్గంలో వెళుతున్న మన దేశం తనను తాను రక్షించుకోగలదు'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ నుంచి వచ్చిన క్షిపణి బ్రహ్మోస్ కావచ్చని పాకిస్తాన్ సైన్యం అనుమానం వ్యక్తం చేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ నుంచి వచ్చిన క్షిపణి బ్రహ్మోస్ కావచ్చని పాకిస్తాన్ సైన్యం అనుమానం వ్యక్తం చేసింది

అసలేం జరిగింది?

మార్చి 9న తమ మిసైల్ ఒకటి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోని మియాన్ చన్ను ప్రాంతంలో పడిందని భారత రక్షణ శాఖ వెల్లడించింది. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగిందని తెలిపింది.

''పాకిస్తాన్ భూభాగంలో పడిన ఒక హై స్పీడ్ ఆబ్జెక్ట్ భారత్ నుంచి వచ్చింది కావచ్చు'' అని పాకిస్తాన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అధిపతి మేజర్ బాబర్ ఇఫ్తికార్ మార్చి 10న జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

''మెయింటెనెన్స్‌ సందర్భంగా పొరపాటు ఒక మిసైల్ ఫైర్ అయ్యింది. ఇది కేవలం సాంకేతిక సమస్యల వల్లే జరిగింది'' అని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, 7 నెలలుగా పాకిస్థాన్ చెరలో శ్రీకాకుళం మత్స్యకారులు

భారత్‌ ఇచ్చిన 'చిన్న వివరణ'తో తాము సంతృప్తి చెందలేదని పాకిస్తాన్‌ విదేశాంగ కార్యాలయం శనివారం తెలిపింది. దీనిపై సంయుక్త విచారణ జరిపించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది.

అయితే ఈ ప్రమాదానికి గురైన క్షిపణి ఏది అనే దానిపై భారత్ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టత లేదు. అయితే అది బ్రహ్మోస్ క్షిపణి కావచ్చని పాక్ సైన్యం ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)