ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం

ఓటరు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఉత్తర్‌ప్రదేశ్ సహా గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం వెల్లడించింది.

మొత్తం ఏడు దశలలో 5 రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర తెలిపారు.

షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ- ఎన్నికల కోడ్) అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

జనవరి 15 వరకు ఎటువంటి రాజకీయ ర్యాలీలు, పాదయాత్రలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహించరాదని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండో దశలో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలను నిర్వహిస్తారు.

మణిపూర్‌ రాష్ట్రానికి ఐదు, ఆరో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 3 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

షెడ్యూల్ ప్రకారం, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న విడుదల కానుంది.

నామినేషన్స్‌కు చివరి తేదీ: జనవరి 21, 2022

నామినేషన్ల పరిశీలన: జనవరి 24, 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 27 జనవరి 2022

ఎన్నికల నిర్వహణ: 10 ఫిబ్రవరి 2022

యోగి

ఫొటో సోర్స్, Getty Images

రెండో దశ ఎన్నికల షెడ్యూల్

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా

నోటిఫికేషన్ విడుదల: 21 జనవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 28 జనవరి 2022

నామినేషన్ల పరిశీలన: 29 జనవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 31 జనవరి 2022

పోలింగ్ తేదీ: 14 ఫిబ్రవరి 2022

మూడో దశ ఎన్నికల షెడ్యూల్

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్

నోటిఫికేషన్ విడుదల: 25 జనవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2022

నామినేషన్ల పరిశీలన: 2 ఫిబ్రవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2022

పోలింగ్ తేదీ: 20 ఫిబ్రవరి 2022

మోది

ఫొటో సోర్స్, Getty Images

నాలుగో దశ ఎన్నికలు

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్

నోటిఫికేషన్ విడుదల: 27 జనవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 3 ఫిబ్రవరి 2022

నామినేషన్ల పరిశీలన: 4 ఫిబ్రవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2022

పోలింగ్ తేదీ: 23 ఫిబ్రవరి 2022

ఐదో దశ ఎన్నికలు

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్

నోటిఫికేషన్ విడుదల: 1 ఫిబ్రవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 8 ఫిబ్రవరి 2022

నామినేషన్ల పరిశీలన: 9 ఫిబ్రవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 11 ఫిబ్రవరి 2022

పోలింగ్ తేదీ: 27 ఫిబ్రవరి 2022

ఆరో దశ ఎన్నికలు

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్, మణిపూర్

నోటిఫికేషన్ విడుదల: 4 ఫిబ్రవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 11 ఫిబ్రవరి 2022

నామినేషన్ల పరిశీలన: 14 ఫిబ్రవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2022

పోలింగ్ తేదీ: 3 మార్చి 2022

సీఈసీ

ఫొటో సోర్స్, Ani

ఏడో దశ ఎన్నికలు

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తర్‌ప్రదేశ్

నోటిఫికేషన్ విడుదల: 10 ఫిబ్రవరి 2022

నామినేషన్లకు చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2022

నామినేషన్ల పరిశీలన: 18 ఫిబ్రవరి 2022

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2022

పోలింగ్ తేదీ: 7 మార్చి 2022

కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం సవాలుతో కూడుకున్న విషయమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్- సీఈసీ సుశీల్ చంద్ర అన్నారు.

''అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వినియోగించనున్నాం. ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఉండేలా ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది''

''రాజకీయ పార్టీలు, తమ అభ్యర్థిని ఎంపిక చేయడానికి గల కారణాన్ని తెలియజేయాలి. పోటీదారులుగా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి''

''ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం లాంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగితే ఓటర్లు 'cVIGIL' అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోగా ఈసీఐ అధికారులు నేరం జరిగిన చోటులో ఉంటారు'' అని ఆయన తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ, నిపుణులు, రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య కార్యదర్శులతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సమావేశాలు నిర్వహించింది.

అందరి అభిప్రాయాలు, గ్రౌండ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, భద్రతా నిబంధనలతో ఎన్నికలను నిర్వహించాలని ఈసీఐ నిర్ణయించిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఐదు రాష్ట్రాల్లో మొత్తం 24.9 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. మొత్తం 18.34 కోట్ల మంది ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఇందులో 8.55 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక పోలింగ్ స్టేషన్‌ను ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలని ఈసీఐ ఆదేశించింది. 5 రాష్ట్రాల్లో కలిసి 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 1620 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామని సీఈసీ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)