పీరియడ్స్‌ను ఈ యాప్‌లతో ట్రాక్ చేయొచ్చు

వీడియో క్యాప్షన్, ‘పీరియడ్స్ ఎప్పుడొస్తాయో ఇవి చెప్పేస్తాయి’

నెలకోసారి వచ్చే పీరియడ్స్ తేదీలు గుర్తుపెట్టుకోవడం ఆడవాళ్లకు పెద్ద పని.

ఒక్కోసారి ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో పీరియడ్స్ మొదలవుతుంటాయి. ఎంతోమంది ఆడవాళ్లు తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.

దీనికి పరిష్కారం పీరియడ్ ట్రాకర్.

ఫ్లో ఓవులేషన్ పీరియడ్ ట్రాకర్, పీరియడ్ పాల్ లాంటి రకరకాల ట్రాకర్లు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి చాలా వరకూ ఉచితంగా లభిస్తాయి. దీని ద్వారా గైనకాలజిస్టులు, న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవాలంటే మాత్రం ఆ సేవలకు తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు అవసరమయ్యే ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇటీవల సినీ నటి 'తాప్సీ పన్ను' పీరియడ్ ట్రాకర్‌ల ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని వివరిస్తూ 'లెట్స్ నార్మలైజ్ పీరియడ్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలను విడుదల చేశారు. పీరియడ్స్‌‌ను సాధారణంగా చూడాలని ఆమె ఈ వీడియోలలో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)