ఆర్యన్ ఖాన్: ఈ 14 షరతులలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుంది

ఫొటో సోర్స్, Ani
ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలకు డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు 14 షరతులు విధించింది.
గురువారం బెయిల్ మంజూరు చేసినప్పటికీ దానికి సంబంధించిన అమలు అదేశాలను శుక్రవారం జారీచేసింది కోర్టు. ఈ ఆదేశాలలో 14 షరతులను విధిస్తూ, వాటిని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని స్సష్టం చేసింది.
ఇవీ షరతులు
* బెయిల్ మంజూరైన ముగ్గురూ ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించాలి.
* ఒకరు కానీ ఇద్దరు కానీ ష్యూరిటీ సంతకాలు పెట్టాలి.
* ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న నేరారోపణల తరహా కార్యకలాపాల్లో పాల్గొనరాదు.
* నిందితుల్లో ఎవరూ తమ సహ నిందితులతో మాట్లాడే ప్రయత్నం చేయరాదు. డ్రగ్స్ సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం ఉన్న ఎవరినీ సంప్రదించరాదు.
* ముగ్గురూ వెంటనే తమతమ పాస్‌పోర్టులను ప్రత్యేక కోర్టుకు సమర్పించాలి.
* కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు.
* ముంబయి దాటి బయటకు వెళ్లాలన్నా దర్యాప్తు అధికారికి తమ ప్రయాణ వివరాలు తెలపాల్సి ఉంటుంది.
* ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయరాదు.
* మీడియాకు ఏ రూపంలోనూ స్టేట్మెంట్లు ఇవ్వరాదు.
* ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరుకావాలి.
* బలమైన కారణం ఉంటే తప్ప విచారణకు గైర్హాజరు కావడానికి వీల్లేదు.
* విచారణ ప్రారంభమైన తరువాత నిందితులు ఏ రకంగాను జాప్యానికి కారణం కారాదు.
* ఎన్‌సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా నిందితులు తప్పనిసరిగా హాజరుకావాలి.
* ఈ షరతులలో దేనిని ఉల్లంఘించినా బెయిల్ రద్దు చేయాలని ఎన్‌సీబీ అధికారులు కోరవచ్చు.
ఇవి కూడా చదవండి:
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- హుజూరాబాద్ ఎన్నిక రేపే... 306 పోలింగ్ కేంద్రాలు రెడీ
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- ''మోదీ లేకున్నా బీజేపీ దశాబ్దాలపాటు ఉంటుంది. రాహుల్‌కు ఇది అర్ధం కావడం లేదు'' అని ప్రశాంత్ కిశోర్ ఎందుకన్నారు?
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- చంబల్ లోయలో 400 మంది బందిపోట్లను సుబ్బారావు ఎలా లొంగదీశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








