వెంకయ్య నాయుడు: భారత ఉప రాష్ట్రపతి ట్విటర్ బ్లూ టిక్ ఎందుకు తొలగించారు?

వెంకయ్య నాయుడు

ఫొటో సోర్స్, Twitter @MVenkaiahNaidu

భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌ ట్విటర్‌ అకౌంట్ల ''బ్లూ టిక్‌'' కనుమరుగు కావడంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా వెంకయ్య నాయుడు అకౌంట్‌కు మళ్లీ బ్లూ టిక్ కనిపిస్తోంది.

శనివారం ఉదయం వెంకయ్య నాయుడు, మోహన్ భగవత్‌ల ట్విటర్ ఖాతాలలో ఈ టిక్ కనిపించలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కొన్ని మీడియా సంస్థలు దీనిపై వార్తలు కూడా రాశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ ''బ్లూ టిక్'' ఇస్తుందన్న సంగతి తెలిసిందే.

కొత్త ఐటీ నిబంధనలపై భారత ప్రభుత్వం, ట్విటర్ మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. వెంకయ్య నాయుడు, భగవత్‌ల బ్లూ టిక్‌లు మాయం కావడానికి దీనితో సంబంధముందని వార్తలు వచ్చాయి.

అయితే, అలాంటిదేమీలేదని ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పారు.

ట్విటర్

ఫొటో సోర్స్, Reuters

అందుకే అలా జరిగింది...

''జులై 2020 నుంచి వెంకయ్య నాయుడు ట్విటర్ ఖాతా నుంచి ఎలాంటి ట్వీట్లు లేవు. అందుకే ఆటోమేటిక్‌గా ఆ టిక్ మాయం అయ్యింది. ఎవరైనా దీర్ఘకాలంపాటు ఎలాంటి ట్వీట్లు చేయకపోతే, వారి బ్లూటిక్ ఆటోమేటిక్‌గా మాయం అవుతుంది''అని ట్విటర్ అధికార ప్రతినిధి వివరించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

విషయాన్ని గుర్తించిన వెంటనే, వెంకయ్య నాయుడు ట్విటర్ ఖాతాకు మళ్లీ ఈ టిక్ మార్క్ ఇచ్చేశామని బీబీసీతో ట్విటర్ అధికార ప్రతినిధి తెలిపారు.

అయితే, మోహన్ భగవత్ ట్విటర్ ''బ్లూ టిక్'' మాత్రం తిరిగి ఇవ్వలేదు.

మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్

ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి: బీజేపీ

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి బ్లూటిక్ తొలగించడంపై ట్విటర్‌ను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సురేశ్ నకుల స్పందించారు.

''ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ట్విటర్ బ్లూ టిక్‌ను ఎందుకు తొలగించారు? ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి''అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

బ్లూ టిక్ కోసం ట్విటర్ వినియోగదారులు పోటీ పడుతుంటారు. దీని కోసం చాలా మంది చాలా రోజులపాటు వేచిచూస్తుంటారు కూడా.

అయితే, బ్లూ టిక్ ఖాతాల రీ-వెరిఫికేషన్ ప్రక్రియను మూడేళ్ల తర్వాత మళ్లీ మొదలుపెడుతున్నట్లు ఈ ఏడాది మొదట్లో ట్విటర్ వెల్లడించింది. దీర్ఘ కాలంపాటు ఎలాంటి ట్వీట్లు లేకపోతే, ఆ ఖాతా వెరిఫైడ్ టిక్‌ను తొలగిస్తామని పేర్కొంది.

ట్విటర్

ఫొటో సోర్స్, Getty Images

ట్విటర్‌కు ఆఖరిసారిగా నోటీసులు

ఐటీ చట్టం కింద తీసుకొచ్చిన కొత్త నిబంధనలను పాటించకపోవడంపై ట్విటర్‌కు భారత ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తుది నోటీసులు పంపించింది.

ఇదే విషయంపై మే 26, మే 28 తేదీల్లోనూ ట్విటర్‌కు మంత్రిత్వ శాఖ నోటీసులు పంపించింది.

అయితే, దీనిపై ట్విటర్ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో తాజా నోటీసులు పంపారు.

''మే 28, జూన్ 2న మీరు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవు. పైగా ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్పడం లేదు. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తోంది''అని జూన్ 5 నాటి నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)