అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

వీడియో క్యాప్షన్, అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

ఆమె వద్దని చెప్పారు. ఆయన ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదన్నారు.

ఆమెను వివాహం చేసుకుంటారు కాబట్టి, అది ఆయనకు సాధారణ విషయంలా అనిపించింది. "కానీ, వేదన కలిగించిన వారినే వివాహం చేసుకోవడం ఆ మహిళకు చాలా కష్టమైన విషయం. అది సాధారణ వివాహంలా ఉండదు" అని నిధి అన్నారు.

నిధి, సునీల్ (పేర్లు మార్చాం) 9 ఏళ్ల క్రితం ఒకరితో ఒకరు సంబంధంలో ఉండేవారు. వారిద్దరి మధ్య ఆ సమయంలో జరిగిన సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఒక వేసవిలో ఆమె నలుపు తెలుపు గళ్ల చొక్కా వేసుకున్నారు. సునీల్‌తో కలిసి ఆయన అద్దెకుండే ఇంటికి వెళ్లారు.

ఆయన తనకు మత్తు ఇచ్చి తనపై అత్యాచారం చేసినట్లు నిధి తాను నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ చర్యను వీడియో తీసిన ఆయన, తనను పెళ్లి చేసుకోకపోతే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడం విన్నారు.

నిధి అడిగిన ప్రతి ప్రశ్నకు "నేను నిన్ను మోసం చేయలేదు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను కదా" అని సునీల్ ఒకే ఒక్క సమాధానం చెప్పేవారు.

ఆమె వివాహానికి అవుననీ చెప్పలేదు, కాదనీ చెప్పలేదు. ఆమె ఈ అత్యాచారం జరిగినట్లు ఎప్పటికీ నిరూపించలేకపోవచ్చు. అత్యాచారానికి గురైన మహిళకు జీవించడం చాలా కష్టంగా ఉంటుంది.

నా అంగీకారం లేకుండా ఆయన తనతో సెక్స్ చేసారని నిధి అంటారు.

"ఆమె నా పై కేసులు వేశారు. కానీ, నేను ఆమెను వివాహం చేసుకున్నాను. మేమిప్పుడు సంతోషంగా ఉన్నాం" అని ఆయన అంటారు.

కానీ, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి, ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోకుండా ఉండుంటే, నిధి జీవితం మరోలా ఉండేది.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)