కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో

ఫొటో సోర్స్, ANI
కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చాలా రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు పెరిగాయి. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు ఓ వ్యక్తిని మాస్కును ధరించనందుకు తీవ్రంగా కొట్టడం సంచలనంగా మారింది. పోలీసులు ఆ వ్యక్తిని కింద పడేసి తీవ్రంగా కొట్టారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఆ ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
హెచ్చరిక: ఈ ట్వీట్‌లోని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"ఆస్పత్రిలో ఉన్న మా నాన్నకు ఆహారం తీసుకు వెళ్తున్నప్పుడు నా మాస్క్ జారింది. అప్పుడు పోలీసులు నన్ను స్టేషన్‌కు రమ్మని బలవంతం చేశారు. తరువాత వస్తానని వారిని అభ్యర్థించాను. ఆ వెంటనే ఆ ఇద్దరు పోలీసులు నన్ను కొట్టడం ప్రారంబించారు" అని ఆ వ్యక్తి చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న ఆ వ్యక్తిని 35 ఏళ్ల ఆటో డ్రైవర్ కృష్ణ ఖైర్‌గా గుర్తించారు. ఆయనపై దాడి చేసిన పోలీసులు కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్. దాడి జరుగుతున్నప్పుడు కృష్ణ ఖైర్ కుమారుడు భయంతో అరుస్తున్నా పోలీసులు కొట్టడం ఆపలేదు.
బహిరంగ ప్రదేశాల్లో ముసుగు ధరించని వారిని అరెస్ట్ చేసి తాత్కాలికంగా జైలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, పోలీసులు తీవ్రంగా ప్రవర్తించడం మొదలైంది.
కుంభమేలాలో లక్షలాది మందిని గంగానదిలో స్నానం చేయడానికి అనుమతించిన దేశంలో, ఆస్పత్రిలో ఉన్న తండ్రికి అన్నం తీసుకువెళ్తున్న వ్యక్తిని కొట్టడం ఏం న్యాయమని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








