విశాఖపట్నం: ‘శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం.. మిగతా ప్రాంతమంతా అడవే...’

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం.. మిగతా ప్రాంతమంతా అడవే...

విశాఖలో ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లైసెన్స్‌లేని సైకిళ్ళను సీజ్ చేసేవారు. సైకిళ్లతోపాటు జట్కా, ఎడ్లబళ్ళకు కూడా లైసెన్స్ పద్దతి ఉండేది.

వీటి లైసెన్స్, ఫైన్‌ల ద్వారా వచ్చిన ఆదాయంతోనే అప్పటీ మున్సిపాల్ వలంటరీ అసోసియేషన్ (ఎంవీఏ ) ఆదాయం సమకూర్చుకునేది.

160 ఏళ్ల కిందట క్రితం ఎంవీఏ పేరుతో మొదలైన పురపాలక సేవల సంఘం ప్రస్తుతం రూ. 3,600 కోట్ల బడ్జెట్ కలిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయికి చేరింది.

మత్స్యకార పల్లె నుంచి మహానగరంగా ఎదిగిన విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు కార్పోరేషన్‌కి ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నగరంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.