విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఏంటి గొడవ? ఆ అడ్డుగోడలు కూలేదెలా?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR

    • రచయిత, ఆదేశ్ కుమార్ గుప్త
    • హోదా, క్రీడా విలేఖరి, బీబీసీ కోసం

ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా సిడ్నీలో ఆడిన మొదటి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో అది మూడు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

అయితే, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి కంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకో విషయం గురించే చర్చ జరుగుతోంది.

రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఏదైనా వివాదం వచ్చిందా అనేదే మాట్లాడుకుంటున్నారు.

భారత జట్టు గత ఏడాది ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నీలో ఆడినపుడు మొట్టమొదట ఇలాంటి వార్తలు వచ్చాయి.

అయితే, ప్రపంచకప్‌లో న్యూజీలాండ్‌తో ఆడిన సెమీ పైనల్ మినహా మిగతా మ్యాచుల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒక విధంగా విరాట్ కోహ్లీకి అతిపెద్ద అండగా నిరూపితమయ్యాడు.

కానీ, చాలాసార్లు ఒక ఆటగాడి ప్రదర్శనకు కెప్టెన్‌ నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాలో కోహ్లీ నుంచి రోహిత్‌కు అవి అందలేదు.

కాలంతోపాటూ ఈ వివాదానికి కూడా తెరపడాల్సింది. కానీ అలా జరగలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన ఆటగాళ్లుగా భావిస్తారు. అందుకే, ఇద్దరిలో ఎవరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఈ వార్తలకు తెరదించాలని ప్రయత్నించలేదు.

అలా చేయలేకపోతే, ఇద్దరూ మైదానం బయట డ్రెస్సింగ్ రూంలో పరస్పరం మాట్లాడుకుని ఉండచ్చు. లేదంటే మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇద్దరూ మాట్లాడి ఉండచ్చు. ఎందుకంటే ప్రపంచకప్ టోర్నీ తర్వాత కూడా ఇద్దరూ కలిసి చాలాసార్లు ఆడారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, AFP

దూరాలు ఎందుకు పెరిగాయి?

బహుశా, సక్సెస్‌ఫుల్‌ కెరీర్ కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల 'ఈగో' ఇంకో మాటలో చెప్పాలంటే 'అహం' వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది.

ఆ దూరం ఇప్పుడు ఎంతగా పెరిగిందంటే, ఆస్ట్రేలియా వెళ్లాక మొదటి వన్డే మ్యాచ్‌కు ఒక రోజు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్సులో "రోహిత్ శర్మ గాయం గురించి చాలా గందరగోళం ఉంది. అతడి గాయం పరిస్థితి గురించి పూర్తి స్పష్టత లేద"ని చెప్పాడు.

మిగతా టీమ్‌తో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఎందుకు రాలేదో కూడా తనకు తెలీదని కోహ్లీ చెప్పాడు. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు రోహిత్ అందుబాటులో లేడని తనకు ఈ-మెయిల్ వచ్చిందన్నాడు.

"ఈ-మెయిల్లో రోహిత్ శర్మకు ఐపీఎల్ సమయంలో గాయం అయ్యిందని చెప్పారు. కానీ, తర్వాత కూడా రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడాడు. అందరూ అతడు ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్‌ ఎక్కుతాడనే అనుకున్నారు. మాకు ఇప్పటికీ తన గురించి ఏదైనా స్పష్టమైన సమాచారం అందుతుందనే వెయిట్ చేస్తున్నాం" అన్నాడు.

రోహిత్ ఎన్సీఏలో ఉన్నాడని, అతడి అసెస్‌మెంట్ జరుగుతోందని చెప్పారు. డిసెంబర్ 11న అతడి ఫిట్‌నెస్ మరోసారి పరీక్షిస్తారని ఉందని మాత్రమే తనకు సమాచారం అందిందని కోహ్లీ చెప్పాడు.

ఇప్పుడు విరాట్ కోహ్లీ చెబుతున్నది నిజమే కావచ్చు, కానీ, ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఓపెన్‌గా మాట్లాడుకోలేనంతగా వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం అనేది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా యూఏఈలో ఐపీఎల్‌లో టోర్నీలో ఇద్దరూ పరస్పరం మట్లాడుకునే అవకాశం వచ్చినప్పటికీ అలా జరగలేదు.

గెలుపోటముల విషయం మర్చిపోయి చాలా టీముల్లోని ఆటగాళ్లు, ప్రత్యర్థి టీమ్ కోచ్‌తో కూడా ఓపెన్‌గా మాట్లాడడం అందరూ చూశారు.

ఇవన్నీ చూస్తుంటే, రోహిత్ శర్మ పాత్రపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే, అతడు తన గాయం గురించి ఇప్పటివరకూ ఓపెన్‌గా మాట్లాడలేదు.

మరోవైపు రోహిత్ గాయపడ్డాడనే ప్రకటన రాగానే, ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని తప్పిస్తారు. ఆ తర్వాత ఐపీఎల్ క్వాలిఫయర్, ఫైనల్ పోటీలు కూడా జరుగుతాయి. వాటిలో కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ టైటిల్ గెలుచి తన సత్తా కూడా చూపిస్తాడు.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, Chris Hyde - CA

బీసీసీఐ ఏం చేస్తోంది?

అయినా, ఇవన్నీ చూస్తుంటే బీసీసీఐ తీరులో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అది ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దాని పనితీరులో కాస్త పరిపక్వత కూడా వచ్చినట్టు కనిపించడంలేదు.

భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఆటగాళ్లు స్వదేశీ క్రికెట్ మ్యాచుల్లో ఆడాలంటే మాత్రం గాయపడ్డామని చెబుతారు. విదేశీ పర్యటనలకు విషయానికి వస్తే, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌తో రెడీ అయిపోతారు.

కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉల్టాగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ ఐఫీఎల్ పైనల్లో ఆడి తాను ఫిట్‌గా ఉన్నట్టు చూపించాలని అనుకున్నాడు. తర్వాత అతడు గాయపడినట్లు ప్రకటించారు.

అయితే, ఆటగాళ్ల మధ్య ఇలాంటి వివాదాలు ప్రపంచమంతా అన్ని ఆటల్లో కనిపిస్తాయి. భారత్ వీటికి అతీతం కాదు.

క్రికెట్ పక్కనపెడితే భారత టెన్నిస్ టీమ్‌లో లియాండర్ పేస్, మిగతా ఆటగాళ్ల మధ్య గొడవలు ఉన్నాయి. పేస్, మహేష్ భూపతి మధ్య గొడవ అందరికీ తెలిసిందే.

1984-85లో ఇంగ్లండ్‌ క్రికెట జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు కెప్టెన్‌గా ఉన్న గావస్కర్ దిల్లీ టెస్ట్ మ్యాచ్ తర్వాత కపిల్ దేవ్‌ను జట్టు నుంచి తొలగించి మహమ్మద్ అజహరుద్దీన్‌కు చోటిచ్చాడు. అలా ఎందుకు జరిగిందో సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ ఇప్పటికీ వివరణ ఇచ్చుకుంటూ ఉంటారు.

అంతే కాదు, భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇంగ్లండ్‌లో తన మొత్తం టీమ్‌తో కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. తనకు, వీరేంద్ర సెహ్వాగ్‌కు మధ్య ఏ గొడవలూ లేవని చూపించడానికే తను అలా చేయాల్సి వచ్చింది. ధోనీకి సెహ్వాగ్‌తోనే కాదు, గౌతం గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌తో కూడా సంబంధాలు ఎలాంటి స్థితికి చేరుకున్నాయో కూడా అందరికీ తెలుసు.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, PAUL ELLIS

మొత్తం గందరగోళంగా మారింది

రోహిత్, కోహ్లీ మధ్య గొడవ ఉందనే దానిలో వాస్తవం ఏమైనా ఉందా, లేక జనాలు కల్పిస్తున్న కట్టుకథలేనా?

సమాధానంగా "ఇదంతా ఒక జోక్ అయిపోయింది. బీసీసీఐ, సెలక్టర్ల పారదర్శకతతో ఉండడం బహుశా అందరికీ మంచిది" ఉండేది అని వీటి గురించి చెప్పిన మాజీ క్రికెటర్, సెలక్టర్‌గా పనిచేసిన అశోక్ మల్హోత్రా చెప్పారు.

రోహిత్ శర్మ 12 రోజుల్లో ఆరు మ్యాచ్‌లు ఆడలేనని చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. అది కూడా తక్కువ రోజుల వ్యవధిలో. ఇక్కడ అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే రోహిత్ గాయపడితే, బీసీసీఐ ఐపీఎల్లో ఆడ్డానికి అతడిని ఎందుకు అనుమతించింది.

రోహిత్ శర్మ బీసీసీఐ లేదా ఫిజియోతో మాట్లాడి ఉండాల్సింది. చూస్తుంటే అనుమానాస్పద స్థితి ఉంది. ఏది తప్పు, ఏది కరెక్టు అనేది ఏదీ అర్థం కావడం లేదు.

రోహిత్ శర్మ రీహాబ్ కోసమే వెళ్లాలని అనుకుని ఉంటే.. తను ఆస్ట్రేలియాకే వెళ్లుండచ్చు. అక్కడకు వెళ్తే తను 14 రోజులు క్వారంటీన్‌లో ఉండాలి. అలా జరిగుంటే సమయానికి ముందే గాయం నుంచి బయటపడేవాడు. చూస్తుంటే, సమస్యలను సృష్టించినట్టు ఉంది. దేని గురించీ స్పష్టమైన సమాచారం ఇవ్వడ లేదు.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, Kai Schwoerer

ఇప్పటి పరిస్థితికి ఎవరు బాధ్యులు

బీసీసీఐ అధ్యక్షుడు, సెలక్షన్ కమిటీ, దీనికి బాధ్యులు అంటున్నారు అశోక్ మల్హోత్రా. ఆటగాళ్ల మధ్య వివాదాలు సరికాదని, వారిని ఈగోలకు దూరంగా ఉంచాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాజీ కెప్టెన్ కూడా. ఇలాంటివన్నీ ఎలా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసు. అతడైనా ఇప్పుడు విషయం బయటపెట్టాలి.

కపిల్ దేవ్‌ను జట్టు నుంచి తొలగించినపుడు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ మధ్య సమస్యను అప్పటి బీసీసీఐ అధికారి ఎన్‌కేపీ సాల్వే కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మను ఎంతో ముఖ్యమైన ఆస్ట్రేలియా టూర్‌ నుంచి తప్పించుండకూడదు.

విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ముళ్లకిరీటంలా అనిపిస్తోందా

ప్రతి కెప్టెన్‌కూ తమకంటూ కోరికలు ఉంటాయని అశోక్ మల్హోత్రా అంటున్నారు.

కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య బంధం సరిగా లేకపోవచ్చు. చిన్న చిన్న గొడవలు ఏవైనా ఉండవచ్చు. అలాంటప్పుడు తప్పు బీసీసీఐ లేదా సెలక్టర్లదే కాదు, రోహిత్ శర్మ చేసింది కూడా తప్పే. రోహిత్ శర్మ తన వాదన ఇప్పటికీ స్పష్టంగా ఎందుకు చెప్పడం లేదు.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR

ఈ ప్రభావం భారత క్రికెట్ మీద పడుతుందా?

ఈ వివాదం భారత క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.

ఇది అసలు మంచిది కాదని అశోక్ మల్హోత్రా చెబుతున్నారు.

ఒకవైపు విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత తిరిగి భారత్ వచ్చేస్తున్నాడు. మరోవైపు వన్డే క్రికెట్‌లో తిరుగులేని రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ కోసం ఎంపికచేశారు. తను ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు కూడా చేశాడు.

విరాట్ కోహ్లీలాగే తన రికార్డులు కూడా అంత తక్కువైనవి కావనే విషయం రోహిత్ శర్మకు తెలుసు.

వన్డేలు, టీ-20ల్లో కోహ్లీ ఎంత కీలకమో, రోహిత్ కూడా అంతే ముఖ్యం. ఇక టెస్ట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే, రోహిత్ డిసెంబర్ 11 తర్వాత ఆస్ట్రేలియాక వెళ్తే, ఆలోపు భారత జట్టు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టీమ్ పైచేయి సాధించేలా కనిపిస్తోంది. వారు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే. చాలా గట్టిపోటీ ఉంటుంది. అలాంటప్పుడు యువ ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించలేం.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR

నిజమా, ఊహాగానాలా

అయితే, ఇక్కడ నిజంగా ఏదైనా విషయం ఉందా, లేక ఇది సందేహం మాత్రమేనా?

ఇక్కడ మొత్తం గందరగోళంగా ఉందని అశోక్ మల్హోత్రా చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తానికి ఎవరో గందరగోళం సృష్టించారు. అందుకే రోహిత్ శర్మను ఒక్క దెబ్బతో వన్డే క్రికెట్ నుంచి బయటకు పంపించారు.

రోహిత్ శర్మ తను ఫిట్‌గా లేనని చెప్పినప్పుడు, అతడికి ఐపీఎల్లో ఆడ్డానికి ఎవరు అనుమతి ఇచ్చారు. ఐపీఎల్ అంతర్జాతీయ పోటీలకంటే మించిందా. ఐపీఎల్ ఫ్రాంచైజీ బీసీసీఐ కంటే పెద్దదా. ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అయినా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తెలివైనవారు. వాకితి మెల్లమెల్లగా ఇదంతా అర్థమవుతుంది.

ఇద్దరి మధ్యా మనం అనుకుంటున్నట్లు ఏదీ లేకుండా కూడా ఉండచ్చు. కానీ, అక్కడ ఏదో గందరగోళం ఉంది.

మాజీ క్రికెటర్, సెలక్టర్ మదన్ లాల్ స్వయంగా ఇలాంటి ఎన్నో వివాదాలను చూశారు. ఆయన ఇది అసలు గొడవ కాదని అభిప్రాయ బేధాల వల్ల ఇలాంటివి వస్తాయని చెబుతున్నారు.

కొన్నిసార్లు ఇద్దరి ఈగోలు క్లాష్ అవుతాయి. చాలాసార్లు అభిప్రాయబేధాలు కూడా వస్తాయి. అందుకే ఎక్కడ చూసినా ఇద్దరు టాప్ ఆటగాళ్ల మధ్య వివాదాలు చాలా ఫేమస్ అవుతాయి.

బోర్డులో సెలక్టర్లు, సపోర్టింగ్ స్టాఫ్ కూడా సమర్థంగా ఉండాలి. ఎందుకంటే కెప్టెన్ కెప్టెనే. అతడికి అన్ని విషయాలూ తెలియాలి. చివరికి జట్టును నడిపించేది అతడే కదా. విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్సులో తన చిరాకు ప్రదర్శించాడు. జట్టులో ఒక టాప్ ఆడగాడు టీమ్‌లో లేకపోతే కెప్టెన్‌కు అలాంటి ఆందోళన ఉంటుంది.

రోహిత్ శర్మ మ్యాచ్ గెలిపించే ఆటగాళ్లలో ఒకడు. అతడు జట్టులో లేకపోవడం అనేది కోహ్లీకి లోటే. రోహిత్ దుబాయ్ నుంచే జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వచ్చుంటే, అక్కడే 14 రోజులు క్వారంటీన్లో ఉంటే బాగుండేదని కోహ్లీ కూడా అన్నాడు.

దాంతో అతడు ఎంత ఫిట్ అనేది కూడా తెలుస్తుంది. తను ఫిట్ లేకపోతే, తిరిగొచ్చేసేవాడు. తను అసలు ఆడగలడా, లేడా అనేది ఇప్పటివరకూ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా తెలీడం లేదు. ఏ ఆటగాడికి ఎవరి స్థానంలో చోటు ఇవ్వవచ్చు అనేది కూడా కెప్టెన్‌కు, కోచ్‌కు తెలిసుండాలి అంటారు మదన్ లాల్.

virat kohli, rohit sharma

ఫొటో సోర్స్, PAUL ELLIS

ఇద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవ గురించి మాట్లాడిన మదన్ లాల్ ఇందులో కోహ్లీ తప్పేమీ లేదన్నారు.

రోహిత్ శర్మ అన్‌ఫిట్ అని ప్రకటించాక కూడా అతడు ముంబై ఇండియన్స్ కోసం ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అంటే తన గాయం నయమైపోయిందా లేక మరింత తిరగబెట్టిందా. తను బాగా బ్యాటింగ్ కూడా చేశాడు. అలా ట్వంటీ20 క్రికెట్‌ ఆడినప్పుడు అన్‌ఫిట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటే మెరుగ్గా ఉండేది. కానీ, తర్వాత పరిస్థితిని చక్కదిద్దానని రోహిత్ చెప్పాడు. ఇప్పుడు అతడు భారత జట్టుకు కూడా అలాగే చేసుండచ్చు.

అయితే, ఇద్దరు ఆటగాళ్లు అంటే కెప్టెన్, వైస్ కెప్టెన్ లాంటి ఆటగాళ్లు ఒకరికొకరు మాట్లాడుకోలేరా

వారిద్దరూ మాట్లాడుకోవచ్చు. కానీ, మొదట విషయం సెలక్టర్ల దగ్గరకు వెళ్లాలి. తర్వాత అది కెప్టెన్ దగ్గరికి వస్తుంది. తర్వాత అతడు ఆటగాళ్లతో మాట్లాడతాడు. రోహిత్ శర్మ ఎంత ఫిట్ అనేది విరాట్ కోహ్లీకి తెలీగానే అతడు ప్రెస్ కాన్ఫరెన్సులో చిరాకుపడ్డాడు.

నిజంగానే ఇద్దరూ గొడవపడ్డారా

గొడవ ఎందుకు వస్తుంది. వారి అభిప్రాయాలు వేరుగా ఉండచ్చు. రోహిత్ శర్మను కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ చేయడం అనేది కోహ్లీ చేతుల్లో లేదు

నేను సెలక్టర్ అయ్యుంటే, రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసేవాడిని. మీరు 60-70 శాతం ఫిట్ అయినా, జట్టుతో వెళ్లాలని చెప్పేవాడిని. తను పూర్తిగా ఫిట్ లేకపోతే అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంచుకునేవాడిని అని మదన్‌లాల్ చెప్పారు.

ఎలా దూరం అవుతుంది

ఇది ఆటగాళ్ల గొడవ కాదు, అలా జరగదు కూడా. ఎందుకంటే ప్రతి ఆటగాడూ తన సత్తా చూపించే జట్టులోకి వస్తాడు. అతడి ప్రదర్శనే సరిగా లేకపోతే గొడవ ఎందుకు చేస్తాడు. అల చేయకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాడు అంటారు మదన్‌లాల్.

ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే లేదా ట్వంటీ20 కెప్టెన్ కావాలని అనుకుంటే, విరాట్ కోహ్లీతో అతడి గొడవకు అదే కారణం అయితే, అందులో కోహ్లీ తప్పేముంది.

కెప్టెన్‌గా ఎవరిని చేస్తారు అనేది సెలక్టర్లపై ఉంటుంది. దానిపై ఏ ఆటగాడూ కోపం చూపించకూడదు. ఎందుకంటే అందరూ భారత్ కోసమే ఆడుతున్నారు.

రోహిత్ శర్మ చాలా పెద్ద ఆటగాడు. అతడి మనసులో అలాంటి కోరిక ఏదైనా ఉందని నాకు అనిపించడం లేదు. అతడికి కెప్టెన్ అయ్యే చాన్స్ వస్తే, కచ్చితంగా అవుతాడు.

ఒకవేళ తను వన్డేలు, ట్వంటీ20లో కెప్టెన్సీ బాగా చేస్తే.. అది భారత్‌కు కూడా మంచిదే. తను ఎప్పటికైనా కెప్టెన్ కాగలడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. తను దానికి అర్హుడు కూడా.

రోహిత్ శర్మ ఫిట్ లేడు, కానీ తను ఎంత అన్ ఫిట్ అనేది అతడికి మాత్రమే తెలుసు. అన్‌ఫిట్‌గా ఉండ కూడా ఐపీఎల్‌లో అతడు ఆడడం అనేది ప్రొఫెషనల్ కావడం వల్లే ఫ్రాంచైజీ కోసం తను ఆడాల్సి వచ్చిందనే విషయం చెబుతుంది.

తాను సెలక్టర్ అయ్యుంటే, మీరు అన్‌ఫిట్ అయినా ఆడారు, రన్స్ కూడా చేశారు. ఏం ఫర్వాలేదు. మీరు టీమ్‌తో కలిసి పదండి. 10-15 శాతం మీరు అక్కడ కోలుకోగలరు. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని అలా వదులుకోలేం అంటానని మదన్ లాల్ చెప్పారు.

మొదటి వన్డే జరిగిన వికెట్ మీద రోహిత్ శర్మ జట్టులో ఉండుంటే తను బహుశా భారత్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ చేసుండేవాడు.

అయినా, మ్యాచ్ ఫలితం ఎవరు ఎలా ఆడితే అలా ఉంటుంది. కానీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న గోడలను ఎంత త్వరగా పడగొడితే భారత జట్టుకు అంత మంచిది అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)