NBSA: భారత న్యూస్ చానళ్లకు నోటీసులు... క్షమాపణలు చెప్పాలని ఆదేశం

ఫొటో సోర్స్, Reuters
భారత టీవీ న్యూస్ చానళ్ల స్వతంత్ర సంస్థ 'న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ' (ఎన్‌బీఎస్ఏ) గత రెండు రోజుల్లో చాలా నోటీసులు జారీ చేసింది.
కొన్ని టీవీ న్యూస్ చానళ్లు తాము చేసిన తప్పులకు బహిరంగ క్షమాపణలు కోరాలని ఎన్‌బీఎస్ఏ ఆదేశించింది.
వీటిలో తాజా కేసు న్యూస్ చానల్ 'టైమ్స్ నౌ'కు సంబంధించినది. అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు క్షమాపణ అడగాలని ఎన్‌బీఎస్ఏ దానికి సూచించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఎన్‌బీఎస్ఏ వివరాల ప్రకారం 'టైమ్స్ నౌ' 2018 ఏప్రిల్ 6న ప్రసారం చేసిన ఒక కార్యక్రమంలో రచయిత, సామాజిక కార్యకర్త సంయుక్తా బసుకు తప్పుడు ఇమేజ్ ఆపాదించేందుకు ప్రయత్నించింది. సంయుక్తకు తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు.
ఎన్‌బీఎస్ఏ తమ నోటీసులో సంయుక్త చేసిన ఫిర్యాదును కూడా ప్రస్తావించింది.
అందులో ఆమె 'టైమ్స్ నౌ తనను ఒక కార్యక్రమంలో హిందూ వ్యతిరేకిగా, భారత సైన్యానికి వ్యతిరేకిగా, రాహుల్ గాంధీ ట్రోల్ ఆర్మీ సభ్యులుగా చెప్పారని" ఫిర్యాదు చేశారు.
తనపై చేసిన తీవ్ర ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరానని, దాని గురించి వారు తనకు ఎలాంటి సూచనా ఇవ్వలేదని ఆమె అందులో చెప్పారు. ఏకపక్షంగా ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వీయ నియంత్రణ, నిష్పక్షపాతం లేదు
ఆ కేసులో ఇప్పుడు టైమ్స్ నౌ క్షమాపణ కోరాలని ఎన్‌బీఎస్ఏ చెప్పింది. "అక్టోబర్ 27న రాత్రి 9 గంటలకు టైమ్స్ నౌ తన టీవీ స్క్రీన్ మీద రిపోర్టింగ్‌లో నిస్పక్షపాతంగా వ్యవహరించలేదని స్పష్టంగా చూపిస్తూ సంయుక్త బసును క్షమాపణ అడగాలి" అని సంస్థ సూచించింది.
పాత కార్యక్రమం యూట్యూబ్, సోషల్ మీడియా, మిగతా ఏ మీడియంలో అయినా ఇప్పటికీ అందుబాటులో ఉంటే, వాటిని కూడా మరో ఏడు రోజుల్లో డెలిట్ చేయాలని టీవీ చానల్‌కు సూచించింది.
ఎన్‌బీఎస్ఏ ఒక స్వతంత్ర విభాగం. ప్రసారాల గురించి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకోడానికి ఎన్‌బీఏ దీనిని ఏర్పాటుచేసింది. ఈ కేసులో టైమ్స్ నౌ స్వీయ-నియంత్రణ పాటించలేదని ఎన్‌బీఎస్ఏ గుర్తించింది.
ఎన్‌బీఎస్ఏ నోటీసులు జారీ చేసిన తర్వాత సంయుక్త బసు ఒక ప్రకటన చేశారు. ఆమె తన ట్విటర్‌లో, "మనం గెలిచాం. రాహుల్ గాంధీ నన్ను కలిసిన తర్వాత ఇదంతా మొదలయ్యింది. టీవీ చానళ్లు రాహుల్‌ను టార్గెట్ చేయడం కోసం నన్ను హిందూ వ్యతిరేకిగా, ట్రోల్ ఆర్మీ సభ్యులుగా వర్ణించాయి. కానీ, అవి చెప్పింది తప్పని నిరూపితమైంది" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"నేను 2019 మార్చి 25న దీనిపై ఫిర్యాదు చేశాను. ఎన్‌బీఎస్ఏ ఇప్పటివరకూ ఆ ఫిర్యాదుపై ఏ చేయలేదు. 2020 అక్టోబర్ 23న నేను దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేవలం 24 గంటల్లో ఎన్‌బీఎస్ఏ ఈ నోటీసులు జారీ చేసింది. నిర్ణయం తీసుకోవడం చాలా ఆలస్యం అయినా, మనకు అనుకూలంగా వచ్చింది" అని రాశారు.

ఫొటో సోర్స్, Reuters
సుశాంత్ కేసులో చాలా చానళ్లకు నోటీసులు
అంతకు ముందు, సుశాంత్ మృతి కేసులో సంచలనాత్మకంగా, తప్పుల తడకలతో, సున్నితత్వం లేకుండా రిపోర్టింగ్ చేసినందుకు ఎన్‌బీఎస్ఏ శుక్రవారం తన సభ్య చానళ్లు ఆజ్ తక్, జీ న్యూస్, న్యూస్ 24, ఏబీపీ న్యూస్, ఇండియా టీవీలకు నోటీసులు పంపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'ఆజ్ తక్' న్యూస్ చానల్‌ను ఎన్‌బీఎస్ఏ మూడు వేరు వేరు కేసుల్లో దోషిగా గుర్తించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ శవాన్ని టీవీలో చూపించినందుకు, సుశాంత్ ట్వీట్ అంటూ తప్పుడు ట్వీట్ ప్రసారం చేసినందుకు, సుశాంత్ కుటుంబం గోప్యతను దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని దృశ్యాలు టీవీలో ప్రసారం చేసినందుకు అక్టోబర్ 27న, అక్టోబర్ 29న, అక్టోబర్ 30న ఆ చానల్ బహిరంగ క్షమాపణ కోరాలని ఆదేశించింది. ఆజ్ తక్ న్యూస్ చానల్‌కు సంస్థ లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
స్థానిక మీడియాలో ప్రచురించిన వార్తల ప్రకారం ఎన్‌బీఎస్ఏ చైర్మన్ జడ్జి(రిటైర్డ్) ఏకే సీకారీ చానళ్లకు వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదులపై పిటిషనర్లు, చానళ్ల ప్రతినిధులతో సెప్టెంబర్ 24న ఆన్‌లైన్‌లో ఒక సమావేశం నిర్వహించారు.
కొన్ని భారత టీవీ చానళ్లు 'సుశాంత్ అలా ఎలా హిట్ వికెట్ అయ్యాడు', 'జీవితం అనే పిచ్‌పై సుశాంత్ హిట్ వికెట్ ఎలా అయ్యాడు'. 'సుశాంత్ ఇంత అశాంతిలో ఎందుకున్నాడు', 'సుశాంత్ మృతిపై 7 ప్రశ్నలు', 'పట్నా సుశాంత్, ముంబయిలో ఫెయిల్ అయ్యాడు' లాంటి ట్యాగ్ లైన్స్ పెట్టడంపై ఈ సమావేశంలో ఆయన విచారం వ్యక్తం చేశారు.
టీవీ చానళ్లు భాష, ప్రసార విలువలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చానళ్ల ప్రతినిధులకు సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"ఇలాంటి ట్యాగ్ లైన్స్ చూస్తుంటే, ప్రస్తుతం ఈ లోకంలో లేని సుశాంత్‌ను ప్రశ్నిస్తున్నట్టు ఉంది. అభ్యంతరకరంగా ఉండే ఇలాంటి ట్యాగ్ లైన్లు ఇతరుల గోప్యత, గౌరవానికి భంగం కలిగించవచ్చు" అన్నారు.
జీ న్యూస్, ఇండియా టీవీకి అక్టోబర్ 27 రాత్రి 9 గంటలకు క్షమాపణ అడగాలని చెప్పింది. అటు న్యూస్ 24 చానల్ అక్టోబర్ 29న రాత్రి 9 గంటలకు తెరపై క్షమాపణ చెప్పాలని సూచించింది.
వీటితోపాటూ అభ్యంతరకరంగా భావించిన ఏబీపీ న్యూస్ కంటెంట్‌ను సోషల్ మీడియా, యూ ట్యూబ్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్‌బీఎస్ఏకు మరిన్ని హక్కులు అందించాలి
న్యూస్ చానళ్లు ప్రసారం చేసే కంటెంట్‌ను నియంత్రించడానికి ఏర్పాటైన ఎన్‌బీఎస్ఏ లాంటి ప్రైవేటు సంస్థల మార్గదర్శకాలపై కేంద్రం ఆమోద ముద్ర వేసి, వాటిని ఎందుకు అమలు చేయలేదని బాంబే హైకోర్టు సోమవారం ప్రశ్నించింది.
ఎన్‌బీఎస్ఏకు విస్తృత ప్రవర్తనా నియమావళి ఉందని, దానిని సభ్య చానళ్లన్నీ అనుసరిస్తాయనే ఆశిస్తున్నామని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిల ధర్మాసనం చెప్పింది.
ఎన్‌బీఎస్ఏకు మరికొన్ని హక్కులు కల్పించవచ్చని, వాటిని ప్రభుత్వం అమలు చేయడానికి తగినట్లు చేయవచ్చని ధర్మాసనం సూచించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తుది విచారణ సమయంలో బాంబే హైకోర్టు ఈ సూచనలు చేసింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రెస్, ముఖ్యంగా టీవీ న్యూస్ చానళ్ల, రిపోర్టింగ్‌ను నియంత్రించాలని పేర్కొంది.
చాలా మంది పిటిషనర్లు ఈ కేసులో మీడియా ట్రయల్‌ను కూడా వ్యతిరేకించారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియా: అభ్యంతరకర ఫోటోలు కనిపిస్తే అమ్మాయిలు వెంటనే ఏం చేయాలి?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రపంచాన్ని ఎలా మార్చేశారు?
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతోందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ఇండియాలో కరోనావైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరిందా? సెకండ్ వేవ్ ఉంటుందా?
- విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








