అస్సాంలో బంగారు పులి

వీడియో క్యాప్షన్, అస్సాంలో బంగారు పులి

కజిరంగా నేషనల్ పార్క్ లోని ఈ బంగారు ఆడ పులి పేరు కాజీ106. థానేకు చెందిన ఫొటోగ్రాఫర్ మయూరేష్ హెంద్రే ఈ ఫొటోలు తీశారు.

‘‘బ్రహ్మపుత్ర నదిలో ఎంవీ మహాబాహు క్రూయిజ్ లో నేచరలిస్ట్, డెస్టినేషన్ మేనేజర్ గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను. కజిరంగా నేషనల్ పార్క్ మేం తరచుగా వెళ్లే ప్రదేశం. ప్రతివారం మేం పర్యటకులను అక్కడకు తీసుకువెళ్లేవాళ్లం. నిరుడు నేను కజిరంగాలో ఉండగా ఈ గోల్డెన్ టైగ్రెస్.. అంటే బంగారు ఆడపులిని చూశాను. మొదటిసారి చూసినప్పుడు అది చాలా దూరంలో ఉంది. అందువల్ల ఫొటో తీయలేకపోయాను. రెండోసారి అది నది ఒడ్డున ఇసుకలో కూర్చొని ఉండ‌గా, చూశాను. వెంటనే ఫొటోలు తీశాను. దాని రంగు ఏదో వింతగా ఉందని అప్పుడే గుర్తించాను. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. వాటిని చూసిన కొందరు వన్యప్రాణి నిపుణులు.. అది బంగారు పులి అని చెప్పారు. దాన్ని ట్యాబీ టైగర్ అని కూడా అంటారని వాళ్లే చెప్పార’’న్నారాయన.గోల్డెన్ టైగర్ లేదా ట్యాబీ టైగర్లకు పసుపు రంగు చర్మంపై సన్నటి నల్లచారలుంటాయి. మామూలు పులులకు ఇలా ఉండవు. మయూరేష్ తీసిన ఫొటోలు కొన్ని రోజుల క్రితం వైరల్ అయ్యాయి. అలాంటి బంగారు పులులు కజిరంగా నేషనల్ పార్కులో నాలుగు ఉన్నాయని పార్కు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)