మన్మోహన్ సింగ్ - జేపీ నడ్డా : త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాధానాల‌తో నిజాన్ని దాచ‌లేరన్న మాజీ ప్రధానికి బీజేపీ అధ్యక్షుడి సమాధానమేంటి

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారం, అబ‌ద్ధాల‌తో నిజాన్ని అణ‌చివేయ‌లేరంటూ భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి మాజీ ప్ర‌ధాని, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు మ‌న్మోహ‌న్ సింగ్ హిత‌వు ప‌లికారు.

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లోని గాల్వ‌న్ లోయ‌లో విధ్వంస‌క‌ర ఘ‌ర్ష‌ణ‌ల‌పై మ‌న్మోహ‌న్ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

"లద్దాఖ్‌లోని ‌గాల్వ‌న్ లోయ‌లో 20 మంది సైనికుల్ని కోల్పోయాం. దేశం కోసం అద్భుతమైన‌ పరాక్ర‌మంతో వారు ప్రాణాలు అర్పించారు. చివ‌రి శ్వాస వ‌ర‌కూ మ‌న మాతృభూమి కోసం పోరాడారు. వారి కుంటుంబాల‌కు మ‌న‌మెంతో రుణ‌ప‌డివున్నాం. వారి ప్రాణ‌త్యాగం వృథాగా పోకూడ‌దు."

"నేడు మ‌నం చ‌రిత్రాత్మ‌క‌మైన కూడ‌లిలో ఉన్నాం. భ‌విష్య‌త్ త‌రాలు మ‌న‌ల్ని ఎలా చూడ‌బోతున్నాయో మన ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు, చ‌ర్య‌లపై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న‌ల్ని న‌డిపించే నాయ‌కులదే ఈ బాధ్యత‌. ప్ర‌జాస్వామ్యంలో ఈ బాధ్య‌త ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యంపై ఉంటుంది. జాతీయ భ‌ద్ర‌త‌, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌తోపాటు త‌ను మాట్లాడే మాట‌లు, తీసుకొనే నిర్ణ‌యాల విష‌యంలో ప్ర‌ధాన మంత్రి ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి."అని మ‌న్మోహ‌న్ అన్నారు.

"మ‌నమంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఎదురు నిల‌వాల్సిన స‌మ‌యం ఇది."

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "మ‌నమంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఎదురు నిల‌వాల్సిన స‌మ‌యం ఇది."

"ఏప్రిల్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గాల్వ‌న్ లోయ‌, ప్యాంగాంగ్ సో లేక్ స‌హా ప‌లు భార‌తీయ ప్రాంతాల్లోకి మ‌ళ్లీమ‌ళ్లీ చొర‌బ‌డుతూ ఆ ప్రాంతాలు త‌మ‌వేన‌ని చైనా అక్ర‌మంగా చెబుతోంది. ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌కు భార‌త్ ఎప్ప‌టికీ భ‌యప‌డ‌దు. ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌కు ఇలాంటి హెచ్చ‌రిక‌లు భంగం క‌లిగించ‌లేవు. త‌మ వైఖ‌రి స‌రైన‌దేన‌ని చెప్పుకునేందుకు వారు మ‌న ‌ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను అడ్డుగా ఉప‌యోగించుకోకుండా చూడాలి. ఈ సంక్షోభం మ‌రింత పెర‌గ‌కుండా చూసేందుకు ప్ర‌భుత్వంలోని అన్ని సంస్థ‌లూ క‌లిసి ప‌నిచేయాలి."

"మ‌నమంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి దురాక్ర‌మ‌ణ‌ల‌కు ఎదురు నిల‌వాల్సిన స‌మ‌యం ఇది."

"నిర్ణ‌యాత్మ‌క నాయ‌కత్వం, దౌత్యానికి బ‌దులుగా త‌ప్పుడుదోవ ప‌ట్టించే స‌మాచారం ఎప్ప‌టికీ స‌మాధానం కాద‌ని ప్ర‌భుత్వానికి మేం గుర్తుచేస్తున్నాం. త‌ప్పుడు స‌మాచారంతో నిజాన్ని ఎప్ప‌టికీ అణ‌చివేయ‌లేరు."

"ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతూ ప్రాణ‌త్యాగం చేసిన క‌ల్న‌ల్ బి సంతోశ్ బాబు, ఇత‌ర జ‌వాన్లకు న్యాయం చేసేందుకు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌భుత్వం, ప్ర‌ధాన మంత్రికి పిలుపునిస్తున్నాం."

"ఇందులో ఏ మాత్రం తేడావ‌చ్చినా.. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని ఒమ్ముచేస్తూ ఇదొక‌ చారిత్ర‌క మోసంగా మిగిలిపోతుంది."

నడ్డా

ఫొటో సోర్స్, Getty Images

"అప్ప‌జెప్పింది మీరే"

మన్మోహ‌న్ వ్యాఖ్య బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తిప్పికొట్టారు. మ‌న్మోహ‌న్ కేవ‌లం ప‌దాల‌తో కనిక‌ట్టు చేశార‌ని అన్నారు.

కాంగ్రెస్ అగ్ర నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ భ‌ద్ర‌తా ద‌ళాల‌ను అగౌర‌వ ప‌రిచేలా మాట్లాడుతుంద‌ని అన్నారు.

"మోదీపై భార‌త్‌కు న‌మ్మ‌క‌ముంది. చాలా క్లిష్ట‌స‌మ‌యాల్లో మోదీ జాతి ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ముందుకు వెళ్ల‌డాన్ని 130 కోట్ల మంది భార‌తీయులు చూశారు."

"మ‌న్మోహ‌న్ ఐక్య‌త కోసం పిలుపునిస్తున్నారు. అయితే ఇక్క‌డ వాతావ‌ర‌ణాన్ని ఎవ‌రు దెబ్బ తీస్తున్నారో చూస్తే అంతా బోధ‌ప‌డుతుంది. త‌న సొంత పార్టీ నేత‌లనైనా మ‌న్మోహ‌న్ గాడిలో పెడితే బావుండేది."

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"చైనాకు 43,000 చ‌.కి.మీ. భూభాగాన్ని అప్ప‌జెప్పిన అదే పార్టీలో మ‌న్మోహ‌న్ స‌భ్యులు. యూపీఏ స‌మ‌యంలో ఎలాంటి పోరాట‌మూ లేకుండానే వ్యూహాత్మ‌క‌, ప్రాదేశిక అంశాల్లో చైనా ఎదుట త‌ల వంచారు."

"2010 నుంచి 2013 మ‌ధ్య 600 సార్లు చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డింది. అప్పుడు ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్ ఉన్నారు. అప్పుడు చైనా ముందు త‌ల వంచ‌కుండా ఆందోళ‌న చెంది ఉండాల్సింది."

"మ‌న్మోహ‌న్ సింగ్ త‌న జ్ఞానాన్ని చాలా అంశాల‌పై పంచుకోవ‌చ్చు. అయితే ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌పై మాట్లాడ‌టం స‌బ‌బుకాదు. ఎందుకంటే యూపీఏ హ‌యాంలో ఈ కార్యాల‌యాన్ని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ధ్వంసం చేశారు. పైగా భ‌ద్ర‌తా సంస్థ‌ల‌ను అగౌర‌వ ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఎన్‌డీఏ దానికి పూర్తి భిన్నంగా న‌డుచుకుంటోంది."

"మ‌న్మోహ‌న్ సింగ్‌, కాంగ్రెస్ పార్టీ... ద‌య‌చేసి మ‌ళ్లీమ‌ళ్లీ సాయుధ బ‌ల‌గాల‌ను అవ‌మానించ‌డం మానుకోండి. వారి ప‌రాక్ర‌మాన్ని ప్ర‌శ్నించ‌కండి. మెరుపుదాడుల స‌మ‌యంలోనూ మీరు ఇలానే చేశారు. ఇలాంటి సంద‌ర్భాల్లో జాతీయ స‌మైక్య‌త‌కు నిజ‌మైన అర్థ‌మేంటో తెలుసుకోండి. ఇప్పటికీ ఆల‌స్య‌మేం కాలేదు."

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మోదీని ప్రశ్నించడంలో మీ ధైర్యమంతా చూపించండి: రణదీప్ సుర్జేవాలా

మన్మోహన్ లేఖ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా సమాధానమిచ్చారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ''దేశ భద్రత, భారతదేశ ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడొద్దు. అలా రాజీ పడితే చైనాతో ఘర్షణలో చనిపోయిన 20 మంది సైనికులను, సాయుధ దళాలను అగౌరవపరిచినట్లే. వెనక్కు తగ్గొద్దు. ప్రభుత్వానికి మేం పూర్తి మద్దతిస్తాం'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మరో ట్వీట్‌లో ఆయన ‘‘2015 నుంచి చైనా 2,264 అతిక్రమణలకు పాల్పడినా ఏమీ చేయలేకపోవడం.. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా జమ్ముకశ్మీర్‌లో 471 మంది జవాన్లు, 253 మంది పౌరులు మరణించడం, 2019లో పాకిస్తాన్ 3,289 కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడంపై మోదీని ప్రశ్నించడంలో మీ ధైర్యం చూపండి’’ అంటూ నడ్డాను ఉద్దేశించి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)