కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ధన్యవాదాలు చెప్పిన మోదీ

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. దీంతో భారతదేశం నుంచి సిక్కులు పాకిస్తాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ప్రాంగణాన్ని సందర్శించేందుకు అవాంతరాలు తొలగిపోయాయి.
భారతదేశం వైపు నుంచి గుర్దాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్ వద్ద ఏర్పాటు చేసిన కర్తార్‌పూర్ కారిడార్ చెక్‌పోస్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. మోదీ టర్బన్ ధరించి, అక్కడ లంగరు (సహపంక్తి)లో ఆహారం స్వీకరించారు.
పాకిస్తాన్ వైపు నుంచి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''కర్తార్‌పూర్ కారిడార్ ప్రాముఖ్యత గురించి నాకు ఏడాది కిందటే తెలిసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కులకు మదీనా వంటిది'' అన్నారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, తదితరులు పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ''గురు నానక్ దేవ్ 550వ జయంతికి ముందు కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించడం మనందరికీ ఆనందంగా ఉంది. సరిహద్దు దాటి గురుద్వారా ప్రాంగణానికి వెళ్లేందుకు వీలుగా అనుకున్న సమయానికల్లా ఈ కారిడార్‌ను నిర్మించడంలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు. గురు నానక్ దేవ్ భారత దేశానికే కాదు, ప్రపంచం అంతటికీ స్ఫూర్తిదాయకులు. నిజమైన విలువలతో జీవించటంలో గొప్పదనాన్ని ఆయన బోధించారు. భారతదేశ మనోభావాలను గౌరవించినందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ధన్యవాదాలు'' అన్నారు.
గురుద్వారా దర్బార్ సాహిబ్ ప్రాంగణాన్ని సందర్శించిన తర్వాత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ''ఇదో మంచి ప్రారంభం. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరడానికి ఇదో మంచి ప్రారంభం అని నేను అనుకుంటున్నాను'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ''నిజంగా ఇదో గొప్ప అనుభూతి. ఈ కారిడార్ క్రమంగా రెండు దేశాల మధ్య శాంతికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
పాకిస్తాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ''స్వాతంత్ర్యం తర్వాత సరిహద్దులు చెరిగిపోయింది ఇప్పుడే. నా మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ భాగస్వామ్యాన్ని ఎవ్వరూ కాదనలేరు. మోదీకి కూడా కృతజ్ఞతలు. మన మధ్య రాజకీయ బేదాభిప్రాయాలు ఉన్నా, నా జీవితాన్ని గాంధీ కుటుంబానికి అంకితం చేసినా.. దీని (కారిడార్) కోసం మీకు మున్నాభాయ్ ఎంబీబీఎస్ స్టైల్ ఆలింగనాన్ని పంపుతున్నాను మోదీ సాబ్'' అన్నారు.

ఫొటో సోర్స్, ImranKhan/twitter
కర్తార్‌పూర్ కారిడార్ ఏంటి? ఎందుకు?
భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న డేరా బాబా నానక్ సాహిబ్, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌లను కలుపుతూ నిర్మించిందే కర్తార్‌పూర్ కారిడార్. 1999లో అప్పటి ఇరు దేశ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయీ, నవాజ్ షరీఫ్‌లు ఈ కారిడార్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. గతేడాది దీనికి శంఖుస్థాపన జరిగింది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు నుంచి 4.7 కిలోమీటర్ల దూరంలో, కర్తార్‌పూర్ పట్టణంలో ఉన్న ఈ సిక్కు ఆధ్యాత్మిక ప్రాంగణాన్ని భారతీయులు సందర్శించేందుకు ఎలాంటి వీసా అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య తీర్పుపై పాకిస్తాన్ ఎలా స్పందించింది?
- అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు
- అయోధ్య తీర్పు: 'అక్కడ ఆలయం లేదని చెప్పాం... ఈ తీర్పు దేశానికి మంచిదికాదు'- చరిత్రకారుడు ఫ్రొఫెసర్ డీఎన్ ఝా
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- ఇంగ్లిష్ మీడియంతో తెలుగు భాషకు ప్రమాదమా...
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- కేఎఫ్‌సీ ప్రపోజల్: భార్యకు ప్రపోజ్ చేసిన యువకుడు.. వీడియో వైరల్.. బహుమతుల వెల్లువ
- అయోధ్య కేసు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








