అబ్దుల్లాపూర్‌మెట్: ‘భూ వివాదంతోనే తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్

ఫొటో సోర్స్, UGC
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహశీల్దారు విజయ రెడ్డిపై ఒక వ్యక్తి పెట్రోలు పోసి, నిప్పంటించాడు.
సోమవారం మధ్యాహ్నం తహశీల్దారు కార్యాలయంలో, ఆమె ఛాంబర్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ విజయ మృతి చెందారు.
ఈ దాడికి పాల్పడిన వ్యక్తి అదే మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు కూర సురేశ్ అని పోలీసులు చెబుతున్నారు.
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తహశీల్దారును కలిసేందుకు కార్యాలయానికి వచ్చిన సురేశ్.. మాట్లాడాలని చెప్పి నేరుగా తహశీల్దారు ఛాంబర్‌కు వెళ్లాడని, తలుపులు వేసి, విజయపై పెట్రోలు పోసి నిప్పంటించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో సురేశ్‌తో పాటు తహశీల్దారు డ్రైవర్, మరొక వ్యక్తికి కూడా మంటలు అంటుకుని, గాయాలు అయ్యాయి.
క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్ సింగ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తహశీల్దార్ కుటుంబం ఇదీ..
- తహశీల్దార్ పూర్తిపేరు పుట్టా విజయ రెడ్డి.
- భర్త సుభాష్ రెడ్డి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్.
- వీరికి ఇద్దరు పిల్లలు.. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
- స్వగ్రామం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి.
- 2009 సంవత్సరం గ్రూప్ 2 నియామకాల్లో విజయ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.

ఫొటో సోర్స్, UGC
‘భూ వివాదంతోనే హత్య’ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్
ఈ ఘటనపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. భూ వివాదం వల్లనే సురేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్థరణకు వచ్చినట్లు చెప్పారు. ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
సురేశ్‌కు సంబంధించిన భూమిపై ఒక కేసు నడుస్తోందని, రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమికి సంబంధించిన వివరాలను సవరించే అంశంపైనే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు.
‘ప్రాణాలు తీయడం దుర్మార్గం’ - రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విజయ రెడ్డి సజీవ దహనంపై రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. రెవెన్యూ అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప ప్రాణాలు తీయడం దుర్మార్గమని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తీవ్రంగా ఖండించిన డిప్యూటీ కలెక్టర్స్, తహశీల్దార్స్ అసోసియేషన్
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయ రెడ్డిది దారుణ హత్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి లచ్చిరెడ్డి, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్ రాములు తెలిపారు.
ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయంలోనే తహశీల్దార్‌ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణమైన సంఘటన అని, విధి నిర్వహణలో తోటి ఉద్యోగిని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని పేర్కొన్నారు.
తహశీల్దారును హత్య చేయడం అమానుషం అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యన్నారాయణ ఒక ప్రకటనలో ఖండించారు.
ఇది ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని వారు కోరారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?
- ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: సీఎస్‌ను బదిలీ చేసే అధికారం సీఎంకు ఉంటుందా?
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- దిల్లీ కాలుష్యం: పొల్యూషన్ మానిటర్స్‌కు అందని స్థాయిలో విష వాయువులు
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
- భారత్ విడుదల చేసిన కొత్త మ్యాపులు ఆమోదయోగ్యం కాదన్న పాకిస్తాన్
- భారతదేశ కొత్త మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎందుకు చూపించలేదు?
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- మెక్ డోనల్డ్స్ బర్గర్లు: పదేళ్లైనా పాడవలేదు.. బూజు పట్టలేదు.. ఎందుకు?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- పవన్ కల్యాణ్: ‘‘ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నా.. పరిష్కరించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా...’’
- రెండు వారాల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పులు
- భారత్‌పై బంగ్లాదేశ్ తొలి టీ20 విజయం, ఖలీల్ అహ్మద్‌పై అభిమానుల ఆగ్రహం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








