కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్ష విజయవంతం... డీఆర్‌డీవోను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫొటో సోర్స్, twitter/DefenceMinIndia
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఒక క్షిపణి పరీక్ష నిర్వహించింది.
'మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసెల్(ఎంపీఏటీజీఎం)' అనే ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారంటూ డీఆర్‌డీవోను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.
యుద్ధ ట్యాంకర్‌కు నమూనా లాంటి ఒక లక్ష్యంపై ఈ క్షిపణి 'టాప్ అటాక్ మోడ్'లో కచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేసిందని ఆయన ట్విటర్‌లో చెప్పారు. ఈ పరీక్ష లక్ష్యాలన్నీ అందుకున్నట్లు తెలిపారు.
భారత సైన్యానికి, డీఆర్‌డీవోకు ఈ విజయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి బరువు తక్కువగా ఉంటుంది. పరీక్షలో ఇది దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ క్షిపణిని మనిషి తీసుకెళ్లగలిగే పోర్టబుల్ ట్రైపాడ్ లాంచర్ నుంచి ప్రయోగించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇది మూడోసారని రక్షణశాఖ తెలిపింది.
ఎంపీఏటీజీఎం మూడో తరం క్షిపణిని అభివృద్ధి చేసేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్-2: అమెరికా చంద్రుడిపైకి వెళ్లేందుకు చేసిన తొలి ప్రయత్నంలో 27 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో అసలేం జరుగుతోంది...
- జమాల్ ఖషోగ్జీ 'బలి ఇవ్వాల్సిన జంతువు' - హత్యకు ముందు రికార్డింగ్ వివరాలు ప్రచురించిన టర్కీ పత్రిక
- ఐఫోన్ 11: యాపిల్ కొత్త మోడల్ ఫోన్ ప్రారంభ ధర ఎంతో తెలుసా
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- 'నేను వినాయకుడి విగ్రహాన్ని ముట్టుకుంటే మైల పడుతుందని దూషించారు'' - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- 8 లక్షల ఏళ్లలో ఎప్పుడూ ఇంత కాలుష్యం లేదు
- భౌతికశాస్త్రం ముఖచిత్రాన్ని మార్చేసిన నలుగురు మహిళలు
- సెరెనా విలియమ్స్‌కు షాకిచ్చిన 19 ఏళ్ల బియాంకా ఆండ్రిస్కూ.. సెరెనా అత్యధిక టైటిళ్ల కలకు బ్రేక్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








