ఆంధ్రప్రదేశ్‌‌లోని పాత ఫొటోతో కశ్మీర్‌లో మహిళలపై పోలీసుల దాడి అంటూ ప్రచారం

సోషల్ మీడియాలో ఫేక్‌న్యూస్ ఫొటోల వ్యాప్తి.

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ కాసం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌లో మహిళలపై పోలీసుల దాడి అంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను సవరించి జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వ నిర్ణయంపై కశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత్ అణచివేస్తుందంటూ కొందరు ఈ ఫొటోను వ్యాప్తి చేస్తున్నారు.

పాక్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు, పాక్ మాజీ మంత్రి ఇజాజ్ ఉల్ హక్ పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ‘‘కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది’’ అని ఫొటోపై కామెంట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాక్‌కు చెందిన జాతీయ భద్రతా విశ్లేషకులు జమీద్ హమీద్ కూడా ఇదే ఫొటోను ట్విటర్‌లో పెట్టి ‘‘ఇమ్రాన్ ఖాన్ బాగా చూడండి... ఈమె మీ కూతురులాంటిది కాదా? ఆర్ఎస్ఎస్ గ్యాంగ్‌స్టర్స్... భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి కశ్మీర్ మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చర్యలు ఆపాలని మోదీకి చెప్పాల్సిన సమయం ఇది కాదా?" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘కశ్మీర్‌లో భారత సైన్యం అమాయక మహిళలపై దాడికి దిగుతోంది’’ అని ఇదే ఫొటోను ఖాన్ అనే నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఆన్‌లైన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్‌సైట్ ‘కోరా’లోనూ కొందరు నెటిజన్లు కశ్మీర్‌పై భారత ప్రభుత్వ దాడి అంటూ ఇదే ఫొటోనూ వ్యాప్తి చేశారు.

ఫేక్ న్యూస్ వ్యాప్తి

ఫొటో సోర్స్, QUoRA

కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం అంటూ చాలా మంది ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

గూగుల్‌ ఇమేజ్‌లో ఈ ఫొటోను అప్‌లోడ్ చేస్తే కశ్మీర్ ఆందోళనకు సంబంధించిన ఫొటోగా చూపిస్తోంది.

ఫేక్ న్యూస్ వ్యాప్తి

ఫొటో సోర్స్, Google

పోలీస్ బ్యాడ్జ్‌ను పరిశీలిస్తే..

వైరల్ అవుతున్న ఈ ఫొటోను ప్రాథమికంగా పరిశీలిస్తే యూనిఫాంలో ఉన్న పోలీసు భుజానికి ఉన్న బ్యాడ్జ్ జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందినది కాదని స్పష్టం అవుతుంది.

ఈ ఫొటోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని బ్యాడ్జ్‌ ఆధారంగా తెలుస్తోంది.

ఫేక్ న్యూస్ వ్యాప్తి

ఫొటో సోర్స్, CPI(M)/TWITTER

కశ్మీర్ పోలీసు బ్యాడ్జ్‌కు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాడ్జ్‌కు తేడా ఉంది. దాన్ని ఈ కింది ఫొటోలో పరిశీలించవచ్చు.

ఫేక్ న్యూస్ వ్యాప్తి

ఫొటో సోర్స్, AP and jammu police dept websites

ఫొటో క్యాప్షన్, ఈ ఫొటోలో మొదటిది ఏపీ పోలీస్ బ్యాడ్జ్, రెండోది జమ్మూ&కశ్మీర్‌ పోలీస్ బ్యాడ్జ్

ఈ ఫొటో ఎక్కడిది?

వాస్తవానికి ఈ ఫొటో 2016లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించింది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ విషయం తేలింది.

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల మూసివేతపై ఎస్‌ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) విద్యార్థులు జులై 2016 లో విజయవాడలో నిరాహార దీక్షలు చేశారు.

ఆ సమయంలో ఎస్‌ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటి ఈ చిత్రం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ ఫొటోను సీపీఐ(ఎం) 2016 జులై 26న తన అధికార ట్విటర్‌లో పోస్టు చేసింది.

దీన్నిబట్టి ఈ ఫొటోకు కశ్మీర్ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)