గుజరాత్‌లో ఆర్టీఐ హత్యలు: ఇప్పటివరకు 13 మందిని చంపేశారు
సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా చేసుకొని అవినీతి మీద పోరాడుతున్న ఉద్యమకారులపై కొందరు దాడులకు పాల్పడటంతోపాటు ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశంలో ఈ ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి.
రాజ్‌కోట్‌లో గత ఏడాది నాన్జీ భాయి అనే ఆర్టీఐ కార్యకర్తను కొందరు హత్య చేయగా, ఇటీవల ఆయన కొడుకు రాజేశ్ కూడా హత్యకు గురయ్యారు. ఆ కుటుంబాన్ని కలిసిన బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న కథనం ఇది.
నాన్జీభాయి పంచాయతీ నిధుల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నించారు.
సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. నాటి నుంచి నేటి వరకు గుజరాత్‌లో 13 మంది ఆర్టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 45 మందిపై దాడులు జరిగాయి. శాంతిభద్రతల విషయంలో 'గుజరాత్ మోడల్ ఇదేనా' అంటూ సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచకప్ నుంచి శిఖర్ ధావన్ ఔట్
- రగ్బీలో భారత మహిళల కొత్త అధ్యాయం
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- ‘బంగాళాదుంపలు’ పండించారని రైతులపై వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్న పెప్సీకో
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీపై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారికి జీవితఖైదు ఎందుకు పడింది?
- అప్పుడు చేతన్ శర్మ.. ఇప్పుడు మహ్మద్ షమీ
- సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఏడుగురు మృతి
- చేతిలో డబ్బున్నా చుక్క నీరు సంపాదించుకోలేకపోతున్నాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)