అరవింద్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టిన సురేశ్ ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై ఒక ఆగంతకుడు దాడి చేసి చెంపదెబ్బ కొట్టాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన కేజ్రీవాల్ దిల్లీలోని మోతీ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
న్యూ దిల్లీ లోక్‌సభ స్థానానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ శనివారం మోతీ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు.
ఆయ ఒక ఓపెన్ టాప్ జీపులో నిలుచుని చేయి ఊపుతూ అభివాదం చేస్తుండగా.. ఎరుపు రంగు టీ షర్ట్ ధరించిన ఒక యువకుడు ముందువైపు నుంచి జీపు ఎక్కి కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టటం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఆ యువకుడిని కేజ్రీవాల్ మద్దతుదారులు వారు వెంటనే కిందికి లాగివేయటం కూడా కనిపించింది. వారు ఆ యువకుడిని కొడుతుండగా పోలీసులు రక్షించి అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌డీటీవీ ఒక కథంలో తెలిపింది.
ఆ యువకుడిని మోతీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అతడిని పార్క్‌లో స్పేర్ పార్ట్స్ వ్యాపారం చేసే 33 సంవత్సరాల సురేష్ అనే వ్యక్తిగా గుర్తించినట్లు పశ్చిమ దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మోనికా భరద్వాజ్ చెప్పారని పీటీఐ తెలిపింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భద్రత విషయంలో ఇదో మరో నిర్లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది ప్రతిపక్ష ప్రేరేపిత దాడి అంటూ ఖండించింది. దిల్లీలో ఆమ్ ఆద్మీని ఈ దాడి నిలువరించజాలదని పేర్కొంది.
అరవింద్ కేజ్రీవాల్ మీద గతంలో కూడా దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2014 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకూ కేజ్రీవాల్ మీద ఐదుసార్లు దాడి జరిగినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన దిల్లీ శివార్లలోని నరేలా ప్రాంతంలో కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారు మీద దాదాపు 100 మంది కర్రలు, బీజేపీ జండాలు ధరించి గుంపుగా దాడి చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
వివిధ మీడియా కథనాల ప్రకారం.. మొదటిగా 2013లో కేజ్రీవాల్ దిల్లీలో మీడియాతో మాట్లాడతున్నపుడు నల్ల సిరాతో దాడి చేశారు. మళ్లీ 2014లో సాధారణ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన మీద ఇంకు దాడి జరిగింది.
అదే ఏడాది దిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహిస్తున్నపుడు ఆయనపై ఓ ఆగంతకుడు దాడిచేసి చెంపదెబ్బ కొట్టాడు. మళ్లీ లాలి అనే ఆటో డ్రైవర్ కేజ్రీవాల్‌కు పూల మాల వేసి రెండు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు.
గత ఏడాది నవంబర్‌లో ఒక యువకుడు దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి చొరబడి, కేజ్రీవాల్ మీద కారంపొడితో దాడి చేయటానికి ప్రయత్నించాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)