హిందువుల మధ్య చిచ్చు పెట్టేందుకు సోనియా ఆదేశాలతో కుట్ర జరిగిందా: Fact Check

ఫొటో సోర్స్, Twitter/@BJP4Karnataka
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
రెండో దశ లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ కర్నాటక విభాగం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ లేఖ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ వివాదాస్పద లేఖ విషయంలో ట్విటర్ వేదికగా పరస్పరం బురద జల్లుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే తన సంతకంతో, తన అసోసియేషన్ లెటర్ హెడ్‌పై ఉన్న ఈ లేఖకు సంబంధించి కర్నాటక హోంమంత్రి, బిజాపూర్ లింగాయత్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ (బీఎల్డీఈఏ) అధ్యక్షుడు ఎంబీ పాటిల్ మంగళవారం ఐపీసీ సెక్షన్ 420 కింద ఓ ఫోర్జరీ కేసు దాఖలు చేశారు.
మత ప్రాతిపదికన కర్నాటకలో ఓట్లను కొల్లగొట్టే ప్రణాళికలను వివరిస్తూ యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 2017 జులై 10న పాటిల్ రాసినట్లుగా చెబుతున్న ఈ లేఖను ఏప్రిల్ 16న బీజేపీ కర్నాటక విభాగం ట్వీట్ చేసింది. అయితే, అది తన పేరుతో సృష్టించిన నకిలీ లేఖంటూ పాటిల్ కేసు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"కాంగ్రెస్ బండారం బయటపడింది. లింగాయత్‌లు, వీరశైవుల మధ్య విభేదాలకు సోనియా గాంధీ ఆదేశాలతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్.. సోనియా గాంధీకి రాసిన లేఖతో ఆశ్చర్యం కలిగించే వివరాలు బయటకొచ్చాయి. కర్నాటకలో హిందువులను విభజించేందుకు సోనియా ఎలా ప్రయత్నిస్తున్నారో తెలుస్తోంది" అని బీజేపీ కర్నాటక విభాగం తన ట్వీట్‌లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరోవైపు తాను అసలు అలాంటి లేఖ ఏదీ రాయలేదని పాటిల్ ట్వీట్ చేశారు. "ఆ లేఖ నకిలీది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. దీన్ని రూపొందించినవారిపైన, దీన్ని ప్రచురించినవారిపైన ఫోర్జరీ కేసు పెడతాను. బీజేపీ ఎంత నిరాశలో కూరుకుపోయిందో తెలుస్తోంది. ప్రజల మద్దతు కోల్పోయారు కాబట్టి ఇలాంటి బూటకపు లేఖలపైనే వాళ్లు ఆధారపడుతున్నారు" అని ఎంబీ పాటిల్ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Twitter/@BJP4Karnataka
ఇంతకీ ఆ లేఖలో ఏముంది?
కర్నాటకలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీకి మూడు గంటల ముందు ఆ రాష్ట్ర పార్టీ ఈ వివాదాస్పద లేఖను ట్వీట్ చేసింది. దీనిపై ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు.
హిందువులను విభజించి, ముస్లింలను కలుపుకొనిపోవాలనే వ్యూహం ద్వారా 2018లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు ఈ లేఖలో ఉంది.
"ముస్లింలను, క్రైస్తవులను వారి నమ్మకాల ఆధారంగా ఒక్కటిగా చేసి, హిందువులను కులాల ఆధారంగా విభజించడం ద్వారా దీన్ని సాధించాలి. దీని కోసం వీరశైవులు, లింగాయత్ వర్గాల మధ్యనున్న విభేదాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించాం. మన బడ్జెట్‌లోను, తర్వాత మేనిఫెస్టోలోను ముస్లింలకు, క్రైస్తవులకు కొన్ని ప్రయోజనాలను ప్రకటించాలి" అని అందులో రాసి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కర్నాటక కాంగ్రెస్ విభాగం బీజేపీ ట్వీట్‌పై స్పందించింది. ఓ పాత నకిలీ లేఖను ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీపై విమర్శలు చేసింది. దీనిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
'ఏడాది కిందటి ఉత్తరం'
2018, మే 12న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు, ఈ ఉత్తరానికి సంబంధించి పబ్లిష్ అయిన వార్తాకథనాలు ఇంటర్నెట్‌లో లభించాయి.
వార్తా కథనాల ప్రకారం, ఈ ఉత్తరాన్ని 'పోస్ట్ కార్డ్' న్యూస్ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు మహేశ్ హెగ్డేను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి ఆరోపణలను పాటిల్ ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన అనంతరం, పోస్ట్ కార్డ్ వెబ్‌సైట్ నుంచి ఆ కథనాన్ని తొలగించారు.
కర్నాటక బీజేపీ ట్వీట్ చేశాక, ఈ ఉత్తరం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యింది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, కన్నడ దినపత్రిక 'విజయవాణి'లో ప్రచురితమైన వార్త ఆధారంగా తాము ఈ ఉత్తరాన్ని షేర్ చేస్తున్నామని కర్నాటక బీజేపీ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''కర్నాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంబీ పాటిల్... లింగాయత్, వీరశైవులను విడదీయడం గురించి సోనియా గాంధీకి రాసిన ఉత్తరాన్ని 'విజయవాణి' పత్రిక ప్రచురించింది. మీడియా తప్పుడు వార్తలను ప్రచురించిందని మీరు భావిస్తున్నారా?'' అన్నది బీజేపీ ట్వీట్ సారాంశం.
కన్నడ వార్తాపత్రిక పాత్ర
విజయవాణి అనేది ఒక కన్నడ దినపత్రిక. ఏప్రిల్ 16న తన ప్రింట్ ఎడిషన్‌లోని రెండో పేజీలో.. సోనియా గాంధీ, పాటిల్ ఫొటోలతోపాటు ఉత్తరం గురించిన కథనాన్ని ప్రచురించింది.
ఫుల్‌పేజ్ కథనానికి 'మళ్లీ విభజన నిప్పును రాజేసిన ఎంబీ పాటిల్' అన్న కన్నడ హెడ్‌లైన్ వాడింది. ఈ కథనంలో పాటిల్ ఫొటోను ప్రచురించి, దానిపై 'ఎంబీ పాటిల్.. సోనియా గాంధీకి ఉత్తరం రాశారా?' అన్న హెడ్‌లైన్ వాడింది.

ఫొటో సోర్స్, Vijayavani
ఆ కథనంలో ఉత్తరానికి కన్నడ అనువాదం కూడా ప్రచురించారు.
''2018 కర్నాటక ఎన్నికలకు ముందే ఈ వివాదాస్పద ఉత్తరం వైరల్ అయ్యింది'' అని బీబీసీ బెంగళూరు ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి అన్నారు.
అయితే, ఏడాది కిందటి ఉత్తరాన్ని, అదికూడా... అవాస్తవమైన ఉత్తరం అన్న ఆరోపణలున్న ఉత్తరాన్ని విజయవాణి పత్రిక ఎందుకు ప్రచురించింది? అదికూడా రెండో దశ లోక్‌సభ ఎన్నికలకు ముందు!
దీనిపై న్యూస్‌పేపర్ యాజమాన్యం, ఎడిటర్ స్పందించలేదు. వారినుంచి ఎలాంటి స్పందన వచ్చినా, ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి.
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- దేశంలో నగదు పంపిణీ కారణంగా రద్దయిన తొలి లోక్‌సభ ఎన్నిక వేలూర్.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసెస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- న్యూస్పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం.. జులై 1 నుంచి అమలు
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









