నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?

కొందరికి పూర్తిగా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతుంటారు. అలా జరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అలా నెలలు నిండకుండా పుట్టిన వారిలో హిమ్మత్ ఒకడు. రెండేళ్ల హిమ్మత్ 10 వారాలు ముందే పుట్టాడు.
గర్భధారణ తర్వాత 40 వారాలకు పుడితే సాధారణ జననం. కానీ 37 వారాలకు ముందు పుట్టినా ఆ బిడ్డకు నెలలు నిండనట్టే లెక్క.
ఇలా పిల్లలు నెలలు నిండకుండా పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి.
వాటిలో ముఖ్యమైనవి ఐవీఎఫ్, డయాబెటిస్, బీపీ, కలుషిత వాతావరణం, అంటువ్యాధులు.
ఇలాంటి సమస్యలు ఉన్న గర్భిణులు పౌష్టిక ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
సమయానికి తినడంతోపాటు, మందులు వాడడంలో, వ్యక్తిగత శుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
"గర్భంలో హిమ్మత్ పెరుగుదల ఆగిపోయిందని అల్ట్రాసౌండ్ పరీక్షలో తెలిసింది. ఆక్సిజన్ అందడం లేదని డాక్టర్లు చెప్పారు. అత్యవసర పరిస్థితి అన్నారు. ఎందుకిలా జరిగిందో, తర్వాతేమవుతుందో మాకు తెలీదు పుట్టిన బిడ్డ బతుకుతాడో, లేదో అనే ఆందోళన. అన్నింటికి మానసికంగా సిద్ధమై వాడి పేరు హిమ్మత్ (ధైర్యం) అని పెట్టుకున్నాం" అని తల్లి ఆంచల్ సూడానీ చెప్పారు..
దీనిపై బీబీసీతో మాట్లాడిన ఎస్‌బీఐఎస్ఆర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సంకల్ప్ టునేజా "సాధారణంగా 40 వారాలు నిండిన తర్వాత ప్రసవం జరుగుతుంది. అందుకే మేం 40 వారాల తర్వాత ఉన్న తేదీని ప్రసవ తేదీగా ముందే లెక్కించి చెబుతాం. దానికన్నా 3 వారాల ముందే శిశువు పుడితే, అంటే 37 వారాల కన్నా ముందే ప్రసవం జరిగితే, అది నెలలు నిండకుండా జరిగినట్లే" అన్నారు.
గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇలాంటి ఇబ్బందులను అరికట్టవచ్చు.
డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులుంటే వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ మందులు వాడాలి. వ్యక్తిగత శుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి.

హిమ్మత్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఏ ఇబ్బందీ లేదు. అందరితో బాగా కలిసిపోతాడు, మాట్లాడతాడు, యాక్టివ్‌గా ఉంటాడు. మామూలు పిల్లలు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు" అని అతడి తల్లి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: ఎక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- ఆమెకు కత్తితో కోసినా నొప్పి తెలియదు...
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









