మోదీ పట్నా ర్యాలీలో 'టెలీ ప్రాంప్టర్' ఎందుకు ఉపయోగించారు

నరేంద్ర మోదీ టెలీప్రాంప్టర్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎలాంటి నోట్స్ చూసుకోకుండా సుదీర్ఘంగా ప్రసంగాలు చేసే నేతగా పేరుంది. స్వతంత్ర దినోత్సవం రోజున కూడా మోదీ ఎర్రకోటపై ప్రసంగాన్ని చదవరు. కాగితాలేవీ చూడకుండానే మాట్లాడుతారు.

అలా చేసినందుకు మోదీ ఎర్రకోటపై ప్రసంగం చదివే సంప్రదాయాన్ని ఉల్లంఘించారని కూడా కొందరు అంటారు.

శనివారం బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి పట్నాలో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

ఏ ర్యాలీలో అయినా నరేంద్ర మోదీ అనర్గళంగా ప్రసంగిస్తారు. కానీ, పట్నాలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు మోదీ ముందు టెలీ ప్రాంప్టర్స్ కనిపించాయి.

పట్నాలో ఆయన సభకు వచ్చిన వారందరూ హిందీవారే. ప్రధాని మోదీకి హిందీ చాలా బాగా వచ్చు. అలాంటప్పుడు హిందీలో ప్రసంగించడానికి ఆయనకు టెలీప్రాంప్టర్ అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తాయి.

బిహార్‌లో బీజేపీ ప్రతినిధులను ఇదే ప్రశ్న అడిగితే, వారు అక్కడ టెలీప్రాంప్టర్ లేదని కొట్టిపారేశారు. అయితే, ర్యాలీ వీడియోలో, ఫొటోల్లో ప్రధానికి రెండు వైపులా టెలీప్రాంప్టర్ ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది.

నరేంద్ర మోదీ టెలీప్రాంప్టర్

ఫొటో సోర్స్, Getty Images

టెలీప్రాంప్టర్ వాడడం మొదటిసారి కాదు

టెలీప్రాంప్టర్ అనేది ఒక టీవీ తెరవంటి డిస్ ప్లే డివైస్. దానిని ప్రసంగించే వారి ముందు ఉంచుతారు. అందులో, ప్రసంగ పాఠం అంతా రోల్ అవుతూ ఉంటుంది. వక్తలు ఆ వాక్యాలు చూస్తూ ప్రసంగిస్తారు. వార్తా చానల్స్‌లో న్యూస్ రీడర్లు కూడా వీటి మీదే ఆధారపడుతుంటారు.

టెలీ ప్రాంప్టర్ ఉపయోగిస్తున్నప్పుడు, వక్త ప్రసంగిస్తున్నారా, లేక దాన్ని చూసి ప్రసంగాన్ని చదువుతున్నారా అనే విషయం సాధారణంగా ప్రేక్షకులకు తెలీదు.

బిహార్ బీజేపీ మిత్రపక్షం జేడీయూ ప్రతినిధి అజయ్ ఆలోక్ కూడా శనివారం గాంధీ మైదానంలో జరిగిన ప్రధాన మంత్రి మోదీ ర్యాలీ వేదికపై ఉన్నారు. అక్కడ టెలీప్రాంప్టర్స్ ఉన్నాయనే విషయాన్ని అజయ్ ఆలోక్ అంగీకరించారు. ధారాళంగా మాట్లాడే మోదీకి టెలీప్రాప్టర్ అవసరం ఏమొచ్చిందని మేం ఆయనను అడిగాం.

దానికి అజయ్ ఆలోక్ "ప్రధాన మంత్రి తన ర్యాలీల్లో టెలీప్రాంప్టర్ ఉపయోగించడం ఇది మొదటిసారేం కాదు. ఇటీవల అన్ని ర్యాలీల్లో ఆయన టెలీప్రాంప్టర్ ఉపయోగిస్తున్నారు. నిజానికి మోదీ తన ప్రసంగాన్ని స్థానిక భాషలో ప్రారంభిస్తున్నారు. పట్నాలో కూడా ఆయన భోజ్‌పురి, మగహీ, మైథిలీలో మాట్లాడారు. ఆ భాషలు ప్రధానికి రావు. అందుకే ఆ భాషల్లో ప్రసంగించడానికి ఆయన టెలీప్రాంప్టర్ ఉపయోగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

టెలీప్రాంప్టర్ ఉపయోగించడం మోదీ ఎన్నికల వ్యూహంలో భాగమేనని అజయ్ ఆలోక్ చెప్పారు. కానీ, బీజేపీ దీనిని ఎందుకు కొట్టిపారేస్తోంది.

దీనిపై బీజేపీ బిహార్ చీఫ్ భూపేంద్ర యాదవ్‌ను సంప్రదిస్తే, ఆయన మీడియా ఇంచార్జ్‌తో మాట్లాడమని చెప్పారు. బిహార్ బీజేపీ మీడియా ఇంచార్జ్ అశోక్ భట్‌ను అడిగితే ఆయన దాని గురించి సమాచారం లేదన్నారు.

నరేంద్ర మోదీ టెలీప్రాంప్టర్

ఫొటో సోర్స్, Getty Images

పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త

మోదీ విదేశీ పర్యటనల్లో కూడా టెలీప్రాంప్టర్ ఉపయోగిస్తారు. సాధారణంగా ఇంగ్లిష్ మాట్లాడే సమయంలో ఆయన టెలీప్రాంప్టర్ చూస్తుంటారు.

వాస్తవిక అంశాలు, గణాంకాల గురించి మాట్లాడేటపుడు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మోదీ టెలీప్రాంప్టర్ ఉపయోగించడం ప్రారంభించారని కొంతమంది చెబుతారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మోదీ తన ర్యాలీల్లో చాలాసార్లు చారిత్రక వాస్తవాల గురించి చెబుతున్నప్పుడు పొరపాట్లు జరిగాయి. బిహార్ 2013లో పట్నాలో జరిగిన ప్రముఖ ర్యాలీలో నరేంద్ర మోదీ బిహార్ బలం గురించి మాట్లాడుతూ చక్రవర్తి అశోకుడి గురించి ప్రస్తావించారు. పాటలీపుత్ర గురించి, నలంద, తక్షశిల గురించి మాట్లాడారు. కానీ, వాస్తవానికి తక్షశిల పంజాబ్‌లో భాగం, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది.

2013లోనే జరిగిన ఒక ర్యాలీలో నరేంద్ర మోదీ, "అలెగ్జాండర్ సైన్యం మొత్తం ప్రపంచాన్ని జయించినా, బిహారీలతో తలపడలేకపోయిందని, ఇక్కడికొచ్చి వాళ్లు ఓడిపోయారని" చెప్పారు. కానీ, నిజానికి అలెగ్జాండర్ సేనలు ఎప్పుడూ గంగా నదిని దాటలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

బీహార్ ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ సుప్రీమో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మోదీ టెలీప్రాంప్టర్ ఉపయోగించడంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ట్వీట్ చేసిన లాలూ అందులో "ఓటమి ప్రభావం కనిపిస్తోంది. తన ప్రణాళిక ఫెయిల్ అయితే మనిషి ఎన్నో అబద్ధాలు చెప్పవచ్చు. బిహార్‌లో రాబోయే ఓటమి భయంతో ఆయన ఆత్మవిశ్వాసం ఎంతకు తగ్గిపోయిందంటే, ఇప్పుడు 'హిందీ స్పీచ్' కూడా ఆయన టెలీప్రాంప్టర్ చూసి చెప్పాల్సి వస్తోంది" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)