అమెరికాలో అరెస్టైన విద్యార్థులు విడుదలయ్యేది ఎప్పుడు

uof

ఫొటో సోర్స్, uof

అమెరికాలో 36 ప్రాంతాల్లో అరెస్టైన 117 మంది భారత విద్యార్థులతో మాట్లాడేందుకు ఇండియన్ ఎంబసీ, భారత కాన్సులేట్ కార్యాలయాలకు దౌత్యపరమైన అనుమతి లభించిందని 'ఆల్ ఇండియా రేడియో న్యూస్' ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అంతకు ముందు, అమెరికాలో నిర్బంధానికి గురైన భారత విద్యార్థుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అరెస్టైన వారికి సంబంధించిన అన్ని విషయాలను చాలా దగ్గరగా గమనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే అరెస్టైన 30 మంది భారత విద్యార్థులను ప్రభుత్వం నియమించిన కౌన్సిలర్ ఆఫీసర్ కలిశారని, మిగిలిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది.

నిర్బంధంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇతర వివరాలు అందించేందుకు వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

+ 202 3221190, +12023402590 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది.

అలాగే, [email protected].కు మెయిల్ చేయవచ్చని తెలిపింది.

అరెస్టైన విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం, ఇండియన్ ఎంబసీ, అమెరికా రాయబార కార్యాలయంతో కలిసి పనిచేస్తుందని, అరెస్టైన విద్యార్థుల సంక్షేమమే అతిముఖ్యమైన అంశంగా ప్రభుత్వం భావిస్తుందని ఆ ప్రకటనలో తెలిపింది.

యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్

ఫొటో సోర్స్, UNIVERSITYOFFARMINGTON.EDU

'తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం'

అరెస్టయిన విద్యార్థులకు అండగా ఉంటామని, వారిని సురక్షితంగా తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తామని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ... 'దాదాపు 140 మంది అరెస్టయ్యారు. వారిలో ఇప్పటివరకు మేం 63 మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించాం. వారిని వీలైనంతవరకు సురక్షితంగా తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తాం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టయిన వారిని తమ తమ దేశాలకు తిప్పి పంపిస్తారు. అయితే, అరెస్టయిన రిక్రూటర్ల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు' అని చెప్పారు.

''బే ఏరియాలో కూడా రెండు రోజుల కిందట 14 మందిని అరెస్ట్ చేసి, వదిలేస్తూ, ఇండియాకు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని పోలీసులు చెప్పారని తెలిసిందని'' భీంరెడ్డి అన్నారు.

సెక్షన్ 237 కింద అరెస్టయిన విద్యార్థుల్లో కూడా ఎలాంటి వీసా చట్టాల ఉల్లంఘనకు పాల్పడని వారు, వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

''వాళ్ళు ఇక్కడే ఉండడానికి చట్టపరమైన పోరాటం చేసే వీలుంటుంది. విద్యార్థుల కుటుంబ సభ్యులతో మేం ఇవాళ కూడా కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడాం. వారు సహజంగానే ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో విద్యార్థుల సేఫ్ డిపోర్టేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం'' అని ఆయన తెలిపారు.

అసలేం జరిగిందంటే..

చదువుకోవడానికి అమెరికా వెళ్లాక, మాస్టర్స్ చదువు అయిపోయాక, అక్కడ కొంత కాలం ఉద్యోగం చేయవచ్చు. దానికి తగిన వీసా వచ్చినవాళ్లు ఉండాలి. రాని వాళ్లు వెనక్కు వెళ్లిపోవాలి. ఇదీ అమెరికాలో రూల్. కానీ చాలా మంది అమెరికాలో ఉండిపోవడం కోసం ఏదో ఒక చోట చదువుతున్నట్టు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు.

అలాంటి వారిని పట్టుకోవడానికి ఈసారి అమెరికా పోలీసులే, యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ పేరుతో ఒక నకిలీ యూనివర్సిటీ పేరు చెప్పి వల వేశారు. దానికి చాలా మంది భారత విద్యార్థులు దొరికిపోయారు. ఇందులో తెలుగు విద్యార్థులూ ఉన్నారు. ఉద్యోగం కోసం తాము నిజంగా చదవకపోయినా, చదువుతున్నట్టుగా పత్రాలు పొందడానికి డబ్బులు ఇచ్చారు.

2015 నుంచీ ఆ రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్న అమెరికా పోలీసులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఈ కేసులో 8 మంది తెలుగు వారిని అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో తెలుగు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

ది యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన పోలీసులు అందులో చేరిన విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకున్నాక యూనివర్సిటీకి సంబంధించిన వెబ్‌సైట్‌ను మూసివేశారు. బాధిత విద్యార్థులు స్థానిక సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారిని కలవాలని వారికి సంబంధించిన వివరాలను ఒక లింక్‌లో ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)