తెలంగాణ ఎన్నికలు: BBC తెలుగులో సిసలైన తెలంగాణ ప్రజావాణి

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ఎన్నికల ముందు సామాన్యుడి నాడి పట్టే పనిలో పడింది బీబీసీ న్యూస్ తెలుగు.
రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, సంఘాలు - వీరెవ్వరూ కాకుండా, యువతను- విద్యార్థులను కలుస్తూ... ఈ ఎన్నికల గురించి వారు ఏం ఆలోచిస్తున్నారు? ఓటు వేయడానికి వారు ఏ అంశాలను చూస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయబోతోంది బీబీసీ.
అందుకోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కచ్చీరు, క్యాంపస్ టాక్, రంగస్థలం పేర్లతో మూడు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
కచ్చీరు:
గ్రామీణ తెలంగాణ యాసలో కచ్చీరు పదాన్ని నలుగురు కుర్చుని మాట్లాడుకునే వేదిక, రచ్చబండ, పంచాయితీ తీర్పులిచ్చే చోటు, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ వంటి అర్థాల్లో వాడతారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఓటు వేయబోతున్న యువతను కలిసే ప్రయత్నం చేయనుంది బీబీసీ. ఇది మేధావుల చర్చా వేదిక కాదు, మొదటిసారి ఓటు వేయబోతున్న యువత గొంతు వినిపించే ప్రయత్నం.
తమ సమస్యలు, పరిష్కారాలు, ఆశయాలు, ఆకాంక్షలతో రాజకీయాలను ఇప్పటి యువత ఎలా చూస్తుందనే విషయాన్ని వివరించే ప్రయత్నం ఈ కచ్చీరు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, సంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణాల్లో ఈ కచ్చీరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది బీబీసీ.

క్యాంపస్ టాక్:
విశ్వవిద్యాలయాల్లోని యువత తెలంగాణకు ఎప్పుడూ ప్రత్యేకమే. నిజాం వ్యతిరేక పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకూ ఉన్న ప్రస్థానంలో, ప్రతీ అడుగులోనూ వారు తమ వంతు పాత్ర పోషించారు.
అందుకే విశ్వవిద్యాలయ యువత ఈ ఎన్నికలను ఎలా చూస్తుందో అందించే ప్రయత్నం క్యాంపస్ టాక్ కార్యక్రమం.
ఉద్యమం సమయంలోని ఆకాంక్షలు - ప్రత్యేక రాష్ట్ర వాస్తవికతలను విద్యార్థులు ఎలా అర్థం చేసుకుంటున్నారో వారి మాటల్లోనే వినిపించే ప్రయత్నం చేయబోతోంది బీబీసీ.
ఈ క్యాంపస్ టాక్‌లో ఆవేశపూరిత వాగ్బాణాలు కాకుండా, విషయాన్ని పట్టి చూపే సంభాషణలుంటాయి.
కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం, నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఈ క్యాంపస్ టాక్ నిర్వహిస్తోంది బీబీసీ.

ఫొటో సోర్స్, Getty Images
రంగస్థలం:
తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం పార్టీలు ఏం చెబుతున్నాయి? అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసింది? ప్రతిపక్షం ఏం చేయాలనుకుంటోంది? తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని పట్టి చూపించే కార్యక్రమం రంగస్థలం.
హైదరాబాద్ నగరంలో జరగబోయే ఈ కార్యక్రమంలో కీలక రాజకీయ పార్టీల ప్రతినిధులు, పౌర సమాజం ప్రతినిధులు పాల్గొంటారు.
వివిధ సమస్యలు - పరిష్కారాలు, విధానాలు - లోపాలపై చర్చ జరపడం ఈ కార్యక్రమ ఉద్దేశం.
ఈ మూడు కార్యక్రమాలను ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది బీబీసీ.
#Kacheeru #CampusTalk #Rangasthalam #BBCTSElections హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన కథనాలను ఎప్పటికప్పుడు అందిస్తాం.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు- 'ఎన్టీఆర్-పై ఎలా గెలిచానంటే'.. ‘జెయింట్-కిల్లర్’ చిత్తరంజన్ దాస్ చెప్పిన ఆనాటి సంగతులు
- దొంగ ఓటును గెలవడమెలా? 'సర్కార్' సినిమా చెప్తున్న సెక్షన్ 49(పి)తో సాధ్యమేనా?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు: సోషల్ మీడియాలో ప్రచారం ఎలా జరుగుతోందంటే..
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. ఃయూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








