సిక్కిం: సుందర పర్వత సీమల్లో అద్భుత విమానాశ్రయం

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

దేశంలోని 100వ విమానాశ్రయాన్ని ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల్లో ఇదీ ఒకటని చెబుతున్నారు.

ప్రపంచంలోని మూడో అతిపెద్ద పర్వత శ్రేణి అయిన కాంచన్‌జంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఎనిమిది పర్వత కనుమల ద్వారా టిబెట్, భూటాన్, నేపాల్‌ దేశాలతో సిక్కిం అనుసంధానమై ఉంది.

ప్రస్తుతం నిర్మించిన పాక్యంగ్ విమానాశ్రయం, సిక్కిం రాజధాని గాంగ్టక్‌కు 30కి.మీ. దూరంలో ఉంది. ఎత్తయిన పర్వతాల మధ్య నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

చైనా సరిహద్దుకు ఈ విమానాశ్రయం కేవలం 80కి.మీ. దూరంలో ఉంది. పాక్యంగ్ గ్రామంలో సముద్ర మట్టానికి 4,500అడుగుల(1371మీటర్ల) ఎత్తులో, 201 ఎకరాల్లో దీన్ని నిర్మించారు.

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

విమానాశ్రయానికి రెండువైపులా లోయలున్నాయి. 1.75 కి.మీ. పొడవైన రన్ వేతో పాటు, ప్రాంగణంలో రెండు పార్కింగ్‌ బే లు ఉన్నాయి. టెర్మినల్ భవనంలో ఒకేసారి వంద ప్రయాణీకులు పడతారు.

భౌగౌళికంగా, వాతావరణపరంగా ఉన్న పరిమితుల కారణంగా తొమ్మిదేళ్ల పాటు సాగిన ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, రన్‌ వేను నిర్మించిన పుంజ్ లాయిడ్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు పడే వర్షాల కారణంగా విమానాశ్రయ నిర్మాణం ఆలస్యమైందని ఇంజినీర్లు చెబుతున్నారు.

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

అక్టోబరు 4 నుంచి ఇక్కడ కమర్షియల్ విమానాల రాకపోకలు మొదలవుతాయి.

సిక్కిం విమానాశ్రయం

ఫొటో సోర్స్, Rajiv Srivastava

ఈ విమానాశ్రయం కారణంగా సిక్కింలో పర్యాటకం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)