'రామాయణంలో సీత టెస్ట్‌ట్యూబ్ బేబీనే.. మహాభారత కాలంలోనే లైవ్ టెలికాస్ట్..'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సతీష్ ఊరుగొండ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రామాయణ కాలంలోనే టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ఉండేదన్న ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
"జనకుడు భూమిలో దున్నుతుంటే ఒక మట్టికుండలో సీత దొరికింది. అంటే ఆనాడు టెస్ట్‌ట్యూబ్ బేబీ లాంటి ఏదో ఒక పద్ధతి తప్పకుండా ఉండే ఉంటుంది అని ఆయన చెప్పారు.
అంతేకాదు, మహాభారత కాలంలోనే జర్నలిజం మొదలైందని కూడా దినేశ్ శర్మ చెప్పారు.
అప్పుడు లైవ్ టెలికాస్ట్ కూడా అందుబాటులో ఉండేదన్న ఆయన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు.
సంజయుడు ఒక చోటు కూర్చొని కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి పూసగుచ్చినట్లు వివరించారని, అది లైవ్ టెలికాస్ట్ వల్లే సాధ్యమని యూపీ డిప్యూటీ సీఎం అన్నారు.
యూపీ రాజధాని లఖ్నోలో బుధవారం నాడు జరిగిన 'హిందీ పాత్రికేయ దినోత్సవ' సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, facebook / dinesh sharma
దినేశ్ శర్మ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యూపీ డిప్యూటీ సీఎం, బీజేపీపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మాటలపై కొందరు విమర్శలు గుప్పిస్తే.. మరికొందరు ఛలోక్తులు విసిరారు.
"త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ కుమార్‌కు యూపీ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ రూపంలో పోటీ ఎదురైనట్లుంది" అని కాంగ్రెస్ సెటైర్ వేసింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

"బీజేపీ అంటే భారతీయ జోక్ పార్టీ" అని రుచిర చతుర్వేది ఛలోక్తి విసిరారు.
విఘ్నేశ్వరుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని గతంలో మోదీ చెప్పారు.
మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని త్రిపుర సీఎం అన్నారు.
ఇప్పుడు సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని యూపీ ఉప ముఖ్యమంత్రి అంటున్నారు.
ముగ్గురూ ముగ్గురే అని రుచిత ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

"హా..హా.. హా. వీళ్లు అత్యంత అమూల్యమైన వారు. సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని డిప్యూటీ సీఎం ప్రకటించారు" అని రఘురామ్ అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఈ నాలుగేళ్లలో భారత్ నాలుగు అమూల్యమైన బహుమతులను ప్రపంచానికి ఇచ్చిందని మొహమ్మద్ దస్తగీర్ అభివర్ణించారు.
ఆ నాలుగు బహుమతులు ఇవేనంటూ ఆయన ట్వీటారు.
1. గణనాధుడు తొలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని మోదీ చెప్పడం,
2. మహాభారతం కాలంలోనే ఇంటర్నెట్ ఉందని త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ అనడం,
3. సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ అభివర్ణించడం,
4. మహాభారత కాలంలోనే జర్నలిజం మొదలైందని దినేశ్ శర్మ చెప్పడం.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

"ఇదే మాట దిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే కాషాయదళం ఊరుకుంటుందా?" అని రాజీవ్ బజాజ్ ప్రశ్నించారు.
"సీతను అవమానించిన దినేశ్ శర్మను పదవి నుంచి బీజేపీ తొలగిస్తుందా? నాకైతే నమ్మకం లేదు" అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

అయితే, ప్రధాని మోదీ, బీజేపీ హయాంలో ఏదైనా సాధ్యమే అని బిస్వరంజన్ అనే యూజర్ సెటైర్ వేశారు.
"సీతను రాముడు అపహరించారని గుజరాత్ పాఠ్యపుస్తకాల్లో ప్రచురించారు. సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని యూపీ డిప్యూటీ సీఎం అంటున్నారు. చరిత్ర, సంస్కృతిని మార్చడానికే వాళ్లు అధికారంలోకి వచ్చారు" అని బిస్వరంజన్ అన్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6

"త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ కుమార్‌కు పోటీ వచ్చింది. పురాణ కాలంలో ప్లాస్టిక్ సర్జరీ ఉందనేందుకు గణపతే నిదర్శనమని గతంలో కూడా ఎవరో అన్నారు" అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అన్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7

"సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ కానేకాదు. అందానికి, ప్రేమకు, ధైర్యానికి అమె ప్రతీక. త్యాగానికి ఆమె నిదర్శనం" అని సాధవి ఖోస్లా ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8

నెటిజన్ల నుంచి వచ్చిన స్పందన చూసిన బీజేపీ కూడా దినేశ్ శర్మ వ్యాఖ్యలను ఖండించింది.
మరోవైపు, సీత టెస్ట్‌ట్యూబ్ బేబీ అని అర్థం వచ్చేలా మాట్లాడిన యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మపై బిహార్ సీతమర్హి జిల్లాలో కేసు నమోదైంది.
సీతను దినేశ్ శర్మ అవమానించారని చందన్ కుమార్ సింగ్ అనే న్యాయవాది కేసు పెట్టారు.
సీతను రాముడు అపహరించారంటూ గుజరాత్‌లో 12వ తరగతి సంస్కృత పాఠ్య పుస్తకంలో ఇటీవలే అచ్చువేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. అనువాద లోపం కారణంగా అలా వచ్చిందని గుజరాత్ బోర్డు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
పురాణాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుల్లో దినేశ్ శర్మ మొదటి వ్యక్తేమీ కాదు.
మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు కనిపెట్టారని ఈ ఏడాది ఏప్రిల్‌లో త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ కుమార్ అన్నారు.
మహాభారతంలో సంజయుడు ఓ చోట కూర్చొని యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. దీని అర్థం ఏంటి? అంటే ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ అంతా ఉనికిలో ఉందన్న మాట. ఇంటర్నెట్, శాటిలైట్లు.. ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. లేదంటే సంజయుడు ఇదంతా తన కంటితో ఎలా చూడగలిగాడు?" అని త్రిపుర సీఎం ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)