#KarnatakaResults: మాజీ మఖ్యమంత్రుల వారసుల్లో ఇద్దరికి ఓటమి

కర్ణాటకకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన దేవెగౌడ, సిద్ధరామయ్య, బంగారప్ప

ఫొటో సోర్స్, facebook

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడుకుంటే ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. ఏదో ఒక స్థాయిలో అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు ఉంటున్నాయి.

కర్ణాటకలో ఇది మరింత ఎక్కువ. ప్రస్తుత ఎన్నికల్లో బరిలో ఉన్నవారిలోనూ వారసుల సంఖ్య తక్కువేం కాదు.

ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల సంతానం ఈసారి పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు.

కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్(ఎస్)తో పాటు జనతాదళ్(యూ) నుంచి వీరు రంగంలో దిగారు.

కర్నాటక ఎన్నికల బరిలో ఉన్న మధు(మాజీ సీఎం బంగారప్ప తనయుడు), యతీంద్ర(సిద్ధరామయ్య తనయుడు), దినేశ్(మాజీ సీఎం గుండూరావు కుమారుడు)

ఫొటో సోర్స్, facebook/twitter

ఫొటో క్యాప్షన్, మధు బంగారప్ప, యతీంద్ర సిద్ధరామయ్య, దినేశ్ గుండూరావు

సిద్ధరామయ్య నుంచి అప్పుడెప్పుడో సీఎంగా పనిచేసిన ఎస్సార్ బొమ్మై వరకు దాదాపుగా అందరి కుమారులూ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

వీరిలో చాలామంది గతంలోనూ ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు ఉన్నారు.

హెచ్‌డీ కుమారస్వామి వంటివారు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.

తాజా ఎన్నికల్లో మాజీ సీఎంల కుమారులు 9 మంది వివిధ నియోజకవర్గాల నుంచి, వేర్వేరు పార్టీల నుంచి పోటీలో నిలిచారు.

కుమార్, మధు బంగారప్ప

ఫొటో సోర్స్, twitter/facebook

ఫొటో క్యాప్షన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయులు కుమార్, మధులు ఒకే నియోజకవర్గం నుంచి వేర్వేరు పార్టీల తరఫున తలపడ్డారు.

బంగారప్ప కుమారుల బాహాబాహీ

కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప తనయులు మధు, కుమార్‌లు ఒకే నియోజకవర్గం నుంచి జేడీఎస్, బీజేపీల నుంచి బరిలో నిలిచారు.

వారి పోరు కన్నడనాట ఆసక్తికరంగా మారింది. షిమోగా జిల్లాలోని సొరబ్ నియోజకవర్గం నుంచి వీరిద్దరూ తలపడ్డారు.

మధు జనతాదళ్(సెక్యులర్) టిక్కెట్‌పై పోటీ చేయగా కుమార బంగారప్ప బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

ఈ అన్నదమ్ముల పోరులో చివరకు కుమార్‌కు విజయం దక్కింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)