ముకేశ్ అంబానీ కోడలు ఎవరో తెలుసా?

ఫొటో సోర్స్, instagram/ambani_akash
భారత్‌లో అత్యధిక ధనవంతుడైన ముకేశ్ అంబానీ కుమారుని పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో జరుగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ కోడలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. అకాశ్ అంబానీ - శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఇటీవలే గోవాలో కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.
ఈ పెళ్లిపై గత కొంత కాలంగా చర్చ జరుగుతున్న తరుణంలో.. ఇప్పుడు ఓ స్పష్టత వచ్చింది.
నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రాల్లో తమ కోడలితో ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, ముకేశ్ తల్లి కోకిలాబెన్ ఉన్నారు.
అంబానీ వియ్యంకుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి.
రసేల్ మెహతా-మోనా మెహతాల మూడో అమ్మాయి శ్లోకా.

ఫొటో సోర్స్, instagram/ambani_akash
బ్లూ డైమండ్స్ అధినేత అయిన రసేల్ మెహతా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వజ్రాల వ్యాపారుల్లో ఒకరు. రసేల్ సంస్థ 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా పరిచయాలున్నాయి.
ఆకాశ్, శ్లోకాలు ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నారు.
2009లో పాఠశాల విద్యను పూర్తిచేసిన శ్లోకా ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేశారు.
తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివారు. 2014 నుంచి రోజీ బ్లూ డైమండ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు.
కనెక్ట్ ఫర్ అనే సంస్థను ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








