ఏడేళ్ల సిరియా అంతర్యుద్ధం: గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు?
మొదటి నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు ఒకటే ధ్యేయం: అధికారం. అధికారం లో కొనసాగేందుకు ఏం చేయడానికైనా ఆయన సిద్ధం.
పశ్చిమ దేశాలు ఆయన యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూనే ఉన్నాయి. ఆయన వాటిని ఖండిస్తూనే ఉన్నారు.
విచక్షణారహిత బాంబు దాడుల నుంచి రసాయన దాడుల వరకు పాల్పడి సిరియాలో మెజార్టీ ప్రజల ప్రాణాలను తీసింది ఆయన ప్రభుత్వానికి చెందిన దళాలే. తీవ్రవాదులు అని ఆయన పిలిచే గ్రూపులే ఆయనకు లక్ష్యం. కానీ వాళ్లలో చాలా మంది తిరుగుబాటుదారులు.
వాళ్ల పోరాటానికి కారణాలెన్నయినా నిజానికి వాళ్లందరి లక్ష్యం ఒక్కటే. అసద్‌ను గద్దె దించడం.
2011లో శాంతియుతంగా సాగుతున్న నిరసన ప్రదర్శనల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అదే సిరియా పతనానికి నాంది పలికింది. మొదట్లో సైన్యం వదిలి వెళ్లిన వారు, పౌర సమాజ సభ్యులు మాత్రమే ఈ నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. కానీ దాడులు క్రూరమైపోయి ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి.
ప్రస్తుతం నిరసన పేరుతో యుద్ధం చేస్తున్నవారిలో ఎక్కువ మంది కరుడుగట్టిన ఇస్లామిక్ వాదులే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)