వైష్ణవి సన్నాయి చేతపడితే.. వీనుల విందే

వీడియో క్యాప్షన్, వీరి ఊపిరే నాదస్వరం

సాధారణంగా నాదస్వరం అంటే.. పురుష వాద్యం అన్న అభిప్రాయం కలుగుతుంది చాలా మందికి. కానీ ఇప్పుడా వాద్యం మహిళా రాగాలను పాడుతోంది.

తమిళనాడు రాష్ట్రం తిరువాయూరులోని ప్రభుత్వ సంగీత కళాశాలలో నలుగురు అమ్మాయిలు నాదస్వరం నేర్చుకుంటున్నారు. ఈ సంగీత కళాశాలలో వీరిదే మొదటి బ్యాచ్. అందులో 19 సంవత్సరాల వైష్ణవి కూడా ఒకరు.

మహిళా నాదస్వర విద్వాంసులకు తమిళనాడులో డిమాండ్ బాగుందని, ఈ విద్య అభ్యసించిన వారికి తగిన గౌరవం దక్కుతుందని వైష్ణవి అంటున్నారు. పెళ్లి.. ఇతర వేడుకల్లో నాదస్వరం వాయించే మహిళలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారంటున్నారు.

వీరిది సంగీత కుటుంబమైనప్పటికీ.. వీరి వంశంలో నాదస్వరం నేర్చుకుంటున్న మొదటి మహిళ వైష్ణవి. ఆడపిల్లలు తమ అభిరుచులకు తగ్గట్టుగా విద్య నేర్చుకునేవారు కాదని, అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిందని వైష్ణవి చెబుతున్నారు.

పెళ్లి తర్వాత కూడా తాను ఈ రంగంలో కొనసాగుతానని వైష్ణవి చెబుతున్నారు. రండి.. ఆమె నాదస్వరాన్ని విందాం..

ఇవి కూడా చదవండి

వీడియో క్యాప్షన్, ‘మృదంగం ముట్టుకుంటే పూనకం వస్తుంది’

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)