కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, ANI
దేశంలోని 80శాతం కేసులు పది రాష్ట్రాలలోనే ఉన్నాయని, కరోనాను పారదోలడంలో ఈ పది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సందర్భంగా అన్నారు.
అయితే ,కరోనా అనుభవం కొత్తది కాబట్టి దీన్ని పాఠంగా తీసుకుని దేశంలో వైద్య సౌకర్యాలు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులపై పరిమితులను తొలగించాలని, కేంద్రం ఆర్ధికంగా రాష్ట్రాలకు మరింత సహాయం చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
80 శాతం యాక్టివ్ కేసులున్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా కృషి చేస్తే దేశం నుంచి కరోనాను పారదోలడం కష్టం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రులనుద్దేశించి అన్నారు.
అత్యధిక యాక్టివ్ కేసులున్న పది రాష్ట్రాలు కరోనా మీద గెలిస్తే, దేశం కూడా గెలిచినట్లేనని మోదీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
72గంటల్లో వైరస్ బాధితుడిని గుర్తించే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చిందని, ఆసుపత్రులలో ఐసీయులు, బెడ్‌ల సంఖ్యను పెంచడం వల్ల కూడా మరణాల రేటు తగ్గడానికి కారణమైందని ప్రధాన మంత్రి అన్నారు.
అయితే తెలంగాణ సహా బీహార్, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో పరీక్షలు ఎక్కువగా జరడంలేదని, వాటిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. రికవరీ రేటు 71శాతంగా ఉంది. మరణాల రేటు 0.7 శాతంగా ఉంది. వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం'' అని సీఎం కె. చంద్రశేఖర రావు ఈ సమావేశంలో వెల్లడించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
భారతదేశంలో సగటు మరణాల రేటు ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. యాక్టివ్ కేసుల శాతం కూడా తగ్గిందని ప్రధాని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించాం, మరిన్ని టెస్టులు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది'' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నట్లు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ ట్విటర్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు మరిన్ని పెంచాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్లు ఈ ట్వీట్‌లో పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తమ రాష్ట్రంలో నమోదైన కోవిడ్-19 మరణాలలో 89మరణాలు కోవిడ్‌తోపాటు ఇతర వ్యాధులు ఉండటంవల్లే ఎక్కువగా జరిగాయిని పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డితోపాటు, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)